Vitamin B12 | రోజంతా నిద్రమత్తుగా ఉందా? ..బహుశా ఇది ‘విటమిన్ B12’ లోపం కావచ్చు..!
Vitamin B12 | ఈ కాలంలో ఎంత నిద్రపోయినా మళ్లీ అలసటగా, మబ్బుగా ఉండటం చాలామందిలో కనిపిస్తున్న సమస్య. దీని వెనుక సింపుల్ కానీ ప్రభావవంతమైన కారణం ఉంది – విటమిన్ B12 లోపం. ఆరోగ్య నిపుణుల ప్రకారం, శరీరంలో ఈ ముఖ్యమైన సూక్ష్మ పోషకం సరైన మోతాదులో లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా నిద్ర సమస్యలు, మూడ్ స్వింగ్స్, జ్ఞాపకశక్తి లోపం వంటి లక్షణాలు కన్పిస్తే, బీ12 స్థాయిలను పరీక్షించుకోవాలి.
#image_title
విటమిన్ B12 లోపం వల్ల వచ్చే లక్షణాలు:
రోజంతా నిద్రమత్తుగా ఉండటం
అలసట, బలహీనత
మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ లాంటి భావోద్వేగ మార్పులు
జ్ఞాపకశక్తి తగ్గడం, తూలి పడిపోవడం
చెమట ఎక్కువగా రావడం, మసక వెలుగు వంటి ఫీలింగ్
నరాల ఆరోగ్యం, మెదడు పనితీరు బాగా ఉండేందుకు B12 కీలకం.
ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.
శక్తి స్థాయులు మెరుగవ్వాలంటే బీ12 అవసరం.
B12 ఎక్కడ లభిస్తుంది?
విటమిన్ B12 మన శరీరం తానే ఉత్పత్తి చేయదు. కాబట్టి ఆహారపు మూలాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది.
బీ12 అధికంగా ఉండే ఆహారాలు:
గుడ్లు
మాంసం
చీజ్
పాలు, పెరుగు
చేపలు
వెజిటేరియన్లు, వేగన్లు అయితే బీ12 సప్లిమెంట్లు లేదా ఫోర్టిఫైడ్ ఫుడ్స్ ద్వారా ఇది అందించుకోవాలి.