Vitamin D And B12 : శరీరానికి విటమిన్లు అనేవి చాలా ముఖ్యమైనవి. ఇవి లేకపోతే శరీరం అనారోగ్యానికి గురవుతుందని నిపుణులు చెబుతుంటారు. అయితే శరీరంలో ఉండే ప్రతి విటమిన్ కూడా అనేక రకాల ప్రయోజనాలు కలిగి ఉంటుంది. వీటిలో ముఖ్యంగా విటమిన్ బి12 మరియు విటమిన్ డి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విటమిన్లు అని చెప్పాలి. శరీరంలో ఈ రెండు విటమిన్ల లోపం ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఈ విటమిన్ లోపాలతో బాధపడేవారు వెంటనే వాటి స్థాయిని పెంచే దిశగా ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. మరి ఈ విటమిన్స్ శరీరానికి ఎంత ఉపయోగం.. ఈ విటమిన్స్ లోపం ఏర్పడితే ఏం జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శరీరంలో విటమిన్ బి12 లోపం ఏర్పడినట్లైతే అది నాడీ వ్యవస్థ మరియు నరాలను బలహీనంగా చేస్తుంది. అలాగే విటమిన్ డి లోపం ఏర్పడినట్లైతేే ఎముకలలో బలం లేకుండా పోతుంది. తద్వారా చిన్న బరువులకు సైతం ఎముకలు విరుగుతాయి. కావున ఇలాంటి అజాగ్రత్త సమస్యలకు దూరంగా ఉండాలి అంటే కచ్చితంగా ఈ రెండు విటమిన్స్ పుష్కలంగా కలిగి ఉన్న ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
ఆరోగ్య నిపుణులు అందిస్తున్న సమాచారం ప్రకారం విటమిన్ బి12 మరియు విటమిన్ డి సప్లిమెంట్లను అనేకసార్లు తీసుకున్నప్పటికీ శరీరంలో వాటి స్థాయి అనేది పెరగదు. కావున ఎలాంటి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు.ఒకవేళ ఈ రెండు విటమిన్లు లోపం ఉన్నట్లయితే సప్లిమెంట్స్ తీసుకొని తిరిగి ఆ స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే ఈ రెండు విటమిన్ ల లోపంతో బాధపడేవారు సప్లిమెంట్స్ తీసుకోవడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఒకటి ఉంది. ఇక ఈ సప్లిమెంట్స్ ను రోజులో కేవలం ఒకే సమయంలో మాత్రమే తీసుకుంటే శరీరం వాటి నుండి ప్రయోజనాలను పొందగలుగుతుంది. తద్వారా దుష్ప్రభావాలు కూడా తగ్గిపోతాయి.
విటమిన్ బి 12 తో పాటువ విటమిన్ బి1, బి2 బి6 కూడా నీటిలో కరిగే విటమిన్లు.అలాగే విటమిన్ సి కూడా నీటిలో కరిగి పని చేస్తుంది. అయితే ఈ విటమిన్లు అన్నీ కూడా కాళీ కడుపుతో బాగా గ్రహించబడతాయి. కావున ఈ విటమిన్ల లోపాలతో బాధపడేవారు అల్పాహారానికి గంట ముందు లేదా గంట తర్వాత వీటిని తీసుకోవడం మంచిది. తద్వారా శరీరం కూడా ముఖ్యమైన విటమిన్లను గరిష్టంగా పొందగలుగుతుంది.
విటమిన్ డి అనేది కొవ్వులతో కరిగేది కాబట్టి శరీరంలో ఆహారం లేదా కొవ్వు ఉన్నప్పుడే దాని ప్రభావం కనిపిస్తుంది. కావున ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత దీనిని తీసుకోవడం వలన మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.