Travelling : దూర ప్రయాణాలు చేసే సమయంలో ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారా… అయితే ఈ చిట్కాలు పాటించండి…!
ప్రధానాంశాలు:
Travelling : దూర ప్రయాణాలు చేసే సమయంలో ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారా... అయితే ఈ చిట్కాలు పాటించండి...!
Travelling : చాలామందికి దూర ప్రయాణాలు చేసే సమయంలో వాంతులు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీంతో కొంతమంది ప్రయాణాలకు దూరంగా ఉంటారు. మరి కొంతమందికి కారు ఎక్కిన తర్వాత వికారంగా ఉంటుంది. దీనిని ” మెన్షన్ సిక్ నెస్ ” అని అంటారు. అయితే ఈ సమస్యతో భాదపడేవారు ప్రయాణం చేసేటప్పుడు వాంతులు కాకుండా ఉండడం కోసం కొన్ని జాగ్రత్తలను పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కారు ఎక్కిన తర్వాత కొంతమంది సీట్లో కూర్చొని కదులుతూ ఉంటారు. దీనివల్ల వెంటనే వాంతులు వస్తాయి. ఎందుకంటే ప్రయాణం చేస్తున్నప్పుడు కళ్ళు మెదడుకు దృశ్య సందేశానికి మరియు లోపల చెవి ఇచ్చే సందేశానికి మధ్య పొంతన ఏర్పడినప్పుడు మెదడు గందరగోళానికి గురి అవచ్చు. దీని కారణంగా ప్రయాణం చేసే సమయంలో వాంతులు లేదా వికారంగా ఉంటుంది.
మరి దీనికి పరిష్కారంగా ప్రయాణం చేస్తున్న సమయంలో కదలకుండా కూర్చోవాలి. అలాగే కారు విండో పక్కన కాకుండా మధ్యలో కూర్చోవడం మంచిది. అంతేకాకుండా కారు ముందు సీట్లో కూడా కూర్చోవచ్చు. చాలామంది ప్రయాణం చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ మరియు లాప్టాప్ వంటివి ఉపయోగిస్తారు. కానీ ఇలా అసలు చేయకూడదు. అంతేకాదు చదవడం వంటివి కూడా చేయకూడదు. ఒకవేళ మీకు వికారంగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే కారు కిటికీలను తెరిచి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలి. ఇకపోతే పాటలు వినడం వలన కూడా మీ మనసుని వికారం నుంచి నియంత్రించవచ్చు. లేదా ఇతరులతో మాట్లాడండి.
దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎక్కువగా తినకూడదు. ప్రయాణం చేసే ముందుగానే అంటే 45 నిమిషాల ముందు లేదా ఒక గంటకి ముందుగానే భోజనాన్ని పూర్తి చేయాలి. ముఖ్యంగా ప్రయాణం చేసే ముందు వేయించిన ఆహారాలు మద్యం మరియు దూమపానం వంటివి చేయకూడదు. ప్రయాణం చేసే సమయంలో లవంగాలు , తులసి , నిమ్మకాయ వంటి సువాసన మూలికలను ఉపయోగించవచ్చు. ఒకవేళ మీకు అసౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే వాహనం యొక్క వేగాన్ని తగ్గించమని చెప్పండి.తద్వారా మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.