Soap : ముఖంపై నల్ల మచ్చలు, ట్యాన్ ను దూరం చేయాలంటే… ఇంట్లోనే సబ్బు తయారు చేసుకోవచ్చు… ఎలాగంటే…!
ప్రధానాంశాలు:
Soap : ముఖంపై నల్ల మచ్చలు, ట్యాన్ ను దూరం చేయాలంటే... ఇంట్లోనే సబ్బు తయారు చేసుకోవచ్చు... ఎలాగంటే...!
Soap : సాధారణంగా మనం ఎన్నో రకాల సబ్బు లను వాడుతూ ఉంటాం. వీటితో ముఖంపై మచ్చలు మరియు ట్యాన్ అనేది ఏర్పడుతుంది. అయితే మీ ముఖంపై మొటిమలు మరియు ట్యాన్ ఉన్నట్లయితే చూడటానికి అసలు బాగోదు. దీనిని దూరం చేసేందుకు మనం ఇంట్లోనే కొన్ని టిప్స్ ను ఫాలో అయితే చాలు. దీనిలో భాగంగానే ట్యాన్ ను రిమూవ్ చేసే సబ్బును కూడా తయారు చేసుకోవచ్చు. దీనివలన ముఖం మరియు స్కిన్ పై ఉన్న మచ్చలు ట్యాన్ అనేది మాయమై ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలి. వీటితో సబ్బును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం…
కావలసిన పదార్థాలు : కాఫీ పొడి ఒక టీ స్పూన్. బియ్యం పిండి ఒక స్పూన్. ఎర్ర కందిపప్పు పొడి ఒక స్పూన్. సోప్ బేస్. విటమిన్ ఈ క్యాప్సిల్స్ టు. రోజు వాటర్ ఒక స్పూన్,కొబ్బరి నూనె ఒక స్పూన్.
తయారీ విధానం : ముందుగా సోప్ బేస్ ను ఒక దానిని తీసుకొని దానిని డబుల్ బెయిల్డ్ పద్ధతిలో కరిగించి తీసుకోవాలి. తర్వాత ఒక్కొక్క పదార్థాలు వేస్తూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. తరువాత తయారైనటువంటి సోప్ మిక్సర్ లో సోప్ మౌల్డ్స్ లేక ఇంట్లో ఉండే ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి. తర్వాత దీనిని తీసుకెళ్లి ఫ్రిజ్ లో పెట్టాలి. తర్వాత రెండు మూడు గంటలకి సోప్ అనేది తయారవుతుంది. దీనిని మీరు ఉపయోగించవచ్చు…
పదార్థాల విషయములో : ఇప్పుడు మనం తయారు చేసినటువంటి పదార్థాలు అనేవి అందరికీ పడకపోవచ్చు. కావున మీకు పడే ఒక పదార్థాన్ని తీసుకోండి. ఉదాహరణకు కాఫీ పౌడర్ గనుక మీకు పడకపోతే దానికి బదులుగా నిమ్మ తొక్కల పొడి లేక ఆరెంజ్ తొక్కల పొడి లాంటి వాటిని కూడా ఉపయోగించవచ్చు. ఇలా ఏదైనా సరే మీ స్కిన్ కు సూట్ అయ్యే పదార్థాన్ని మాత్రమే కలుపుకోండి…
ఎక్స్ ఫోలియేషన్ : ఇలా మీరు సబ్బును మాత్రమే వాడకుండా వారంలో ఒక్కసారైనా స్క్రబ్ ను కూడా వాడండి. దీనిని కూడా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే…
నిమ్మరసం,పంచదార : నిమ్మరసం మరియు పంచదార ఈ రెండిటిని సమాన మోతాదులో తీసుకోవాలి. తరువాత పంచదార మొత్తాన్ని బాగా కరగనివ్వాలి. దీనిని చర్మానికి మరియు ముఖానికి బాగా మసాజ్ చేసుకోండి. ఇలా చేయడం వలన మృత కణాలు అనేవి తొలగిపోతాయి…
బంగాళదుంప రసం : ఈ బంగాళదుంప దూరం చేయటంలో బాగా హెల్ప్ చేస్తుంది. దీనికోసం చెక్కు తీసినటువంటి బంగాళ దుంపలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసి దాని నుండి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని స్కిన్ పై అప్లై చేసుకొని 10 నిమిషాల తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. తర్వాత పండినటువంటి బొప్పాయి ముక్కలు తీసుకొని స్మాష్ చేయండి. తర్వాత దీనిలో కొద్దిగా తేనెను కూడా కలుపుకోండి. ఈ రెండు మీ ముఖం పై ఉన్న నల్ల మచ్చలు మరియు ట్యాన్ ను తొలగించి ముఖాన్ని ఎంతో కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది…