Pesarattu Sandwich : పెసలు అనేవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎంతో మంది పెసలతో అట్లు కూడా పోసుకొని తింటూ ఉంటారు. ఇది హైప్రోటీన్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు. దీనిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పెసరట్లు మరియు పునుగులు మాత్రమే కాకుండా వీటితో సాండ్ విచ్ కూడా తయారు చేసుకోవచ్చు. దీని రుచి కూడా చాలా బాగుంటుంది. అలాగే దీనిని బ్రేక్ ఫాస్ట్ కి, లంచ్ కి,డిన్నర్ కి ఏ టైంలో నైనా సరే ఈ పెసరట్టు తో చేసిన సాండ్ విచ్ ను తినొచ్చు. ఈ సాండ్ విచ్ ను ఒకటి తింటే చాలు కడుపు నిండుగా ఉంటుంది. అయితే ఈ పెసరట్టు తో సాండ్ విచ్ ను తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు ఏమిటి.? దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
కావాల్సిన పదార్థాలు : పెసరపప్పు, బ్రెడ్, టమాటా, అల్లం, ఉప్పు, జీలకర్ర, శనగపిండి, ఇంగువ, గరం మసాలా, పసుపు, టమాటా సాస్, మయోనీస్, చీజ్, నెయ్యి…
తయారీ విధానం : ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడుక్కొని రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. ఈ పెసరపప్పును ఉదయాన్నే కడిగి నీళ్లు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు మరియు శెనగపిండి,జిలకర్ర, ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. వీటిలో కొద్దిగా నీళ్ళు పోసుకొని చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండితో చిన్న పాటి సైజులో అట్టు ను పోసుకోవాలి. దాని తర్వాత నెయ్యి వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అయితే దీనిని రౌండ్ గా కాకుండా చతురస్రాకారంలో వేసుకోండి. అట్టు అనేది వేగిన తర్వాత దానిని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ పెనం మీదనే నెయ్యి వేసి బ్రెడ్ ను రెండు వైపులా కాల్చుకోవాలి.
ఒక బ్రెడ్డు తీసుకొని ఒకవైపు టమాటా సాస్,మయోనీస్, చీజ్, మసాలా చల్లుకోవాలి. ఆ తర్వాత టమాటాలు రౌండ్ గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై పెసరట్టును వెయ్యాలి. దీనిపైన మరొక బ్రెడ్ వేసి కవర్ చేయాలి. ఆ తర్వాత దీన్ని పెనంపై లైట్ గా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పెసరట్టు సాండ్ విచ్ రెడీ. ఈ రెసిపీ అనేది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. దీనిని వాళ్ళకు లంచ్ బాక్స్ లో కూడా పెట్టి ఇవ్వొచ్చు…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.