Pesarattu Sandwich : పెసరట్టుతో కూడా సాండ్ విచ్ ను తయారు చేసుకోవచ్చు… ఎలాగంటే…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pesarattu Sandwich : పెసరట్టుతో కూడా సాండ్ విచ్ ను తయారు చేసుకోవచ్చు… ఎలాగంటే…??

Pesarattu Sandwich : పెసలు అనేవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎంతో మంది పెసలతో అట్లు కూడా పోసుకొని తింటూ ఉంటారు. ఇది హైప్రోటీన్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు. దీనిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పెసరట్లు మరియు పునుగులు మాత్రమే కాకుండా వీటితో సాండ్ విచ్ కూడా తయారు చేసుకోవచ్చు. దీని రుచి కూడా చాలా బాగుంటుంది. అలాగే దీనిని బ్రేక్ ఫాస్ట్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 October 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Pesarattu Sandwich : పెసరట్టుతో కూడా సాండ్ విచ్ ను తయారు చేసుకోవచ్చు... ఎలాగంటే...??

Pesarattu Sandwich : పెసలు అనేవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎంతో మంది పెసలతో అట్లు కూడా పోసుకొని తింటూ ఉంటారు. ఇది హైప్రోటీన్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు. దీనిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పెసరట్లు మరియు పునుగులు మాత్రమే కాకుండా వీటితో సాండ్ విచ్ కూడా తయారు చేసుకోవచ్చు. దీని రుచి కూడా చాలా బాగుంటుంది. అలాగే దీనిని బ్రేక్ ఫాస్ట్ కి, లంచ్ కి,డిన్నర్ కి ఏ టైంలో నైనా సరే ఈ పెసరట్టు తో చేసిన సాండ్ విచ్ ను తినొచ్చు. ఈ సాండ్ విచ్ ను ఒకటి తింటే చాలు కడుపు నిండుగా ఉంటుంది. అయితే ఈ పెసరట్టు తో సాండ్ విచ్ ను తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు ఏమిటి.? దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

కావాల్సిన పదార్థాలు : పెసరపప్పు, బ్రెడ్, టమాటా, అల్లం, ఉప్పు, జీలకర్ర, శనగపిండి, ఇంగువ, గరం మసాలా, పసుపు, టమాటా సాస్, మయోనీస్, చీజ్, నెయ్యి…

తయారీ విధానం : ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడుక్కొని రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. ఈ పెసరపప్పును ఉదయాన్నే కడిగి నీళ్లు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు మరియు శెనగపిండి,జిలకర్ర, ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. వీటిలో కొద్దిగా నీళ్ళు పోసుకొని చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండితో చిన్న పాటి సైజులో అట్టు ను పోసుకోవాలి. దాని తర్వాత నెయ్యి వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అయితే దీనిని రౌండ్ గా కాకుండా చతురస్రాకారంలో వేసుకోండి. అట్టు అనేది వేగిన తర్వాత దానిని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ పెనం మీదనే నెయ్యి వేసి బ్రెడ్ ను రెండు వైపులా కాల్చుకోవాలి.

Pesarattu Sandwich పెసరట్టుతో కూడా సాండ్ విచ్ ను తయారు చేసుకోవచ్చు ఎలాగంటే

Pesarattu Sandwich : పెసరట్టుతో కూడా సాండ్ విచ్ ను తయారు చేసుకోవచ్చు… ఎలాగంటే…??

ఒక బ్రెడ్డు తీసుకొని ఒకవైపు టమాటా సాస్,మయోనీస్, చీజ్, మసాలా చల్లుకోవాలి. ఆ తర్వాత టమాటాలు రౌండ్ గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై పెసరట్టును వెయ్యాలి. దీనిపైన మరొక బ్రెడ్ వేసి కవర్ చేయాలి. ఆ తర్వాత దీన్ని పెనంపై లైట్ గా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పెసరట్టు సాండ్ విచ్ రెడీ. ఈ రెసిపీ అనేది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. దీనిని వాళ్ళకు లంచ్ బాక్స్ లో కూడా పెట్టి ఇవ్వొచ్చు…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది