Weight Lose : కొబ్బరి నూనెను ఇలా వాడితే చాలు... ఈజీగా బరువు తగ్గొచ్చు...!!
Weight Lose : మీ ముఖం మరియు జుట్టు అందాన్ని పెంచడానికి మీరు కొబ్బరి నూనెను ఎన్నోసార్లు వాడి ఉంటారు. అయితే మీరు బరువును తగ్గించుకోవడానికి కొబ్బరి నూనె కూడా హెల్ప్ చేస్తుంది అనే విషయం మీకు తెలుసా. అలాగే ఊబకాయం తీవ్రమైన పరిణామాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నో సార్లు హెచ్చరించింది. అలాగే అధిక ఊబకాయం అనేది ఇతర తీవ్రమైన వ్యాధులకు కూడా కారణం అవుతుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీ బరువును తగ్గించడానికి ఎన్నో మార్గాలలో కొబ్బరి నూనెను వాడవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం…
కొబ్బరినూనె ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది : ఆరోగ్య నిపుణుల అభిప్రాయ ప్రకారం చూసినట్లయితే, ఈ కొబ్బరి నూనెలో గుండెకు ఎంతో ఆరోగ్యకరమైన లక్షణాలు ఉన్నాయి. ఇది మంచి వంటనూనే గా కూడా ఉపయోగపడుతుంది. ఈ కొబ్బరి నూనె అనేది బరువును నియంత్రించటంలో సహాయపడటమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడం వలన గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శరీరంలో కొవ్వు శాతం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో వాపు కూడా మొదలవుతుంది. అయితే దీని కారణం చేత కొవ్వు కణాలు అనేవి శరీరానికి తగినంత శక్తిని ఉత్పత్తి చేయలేవు. కానీ ఈ కొబ్బరినూనె లో ఉన్నటువంటి యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు శరీరంలోని ఇన్ ఫ్లవేషన్ ను నియంత్రించడం వలన కొవ్వు ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే సంతృప్త కొవ్వుతో సమృద్ధిగా ఉండడం వలన కొబ్బరి నూనెలో సహజమైన ఆకలిని తగ్గించే గుణాలు ఉన్నాయి. అయితే ఈ కొబ్బరి నూనెను తీసుకోవటం వలన ఒక వ్యక్తికి పదేపదే ఆహారం తినాలి అని అనిపించదు. దీంతో ఆ వ్యక్తి ఎక్కువ కేలరీలు తీసుకోకుండా ఉంటాడు.ఇది బరువు తగ్గేందుకు ఎంతో హెల్ప్ అవుతుంది…
బరువు తగ్గడానికి కొబ్బరి నూనెను ఇలా వాడండి : మీరు వంట కోసం వివిధ నూనెలకు బదులుగా కొబ్బరి నూనెను కూడా వాడవచ్చు. అయితే ఆరోగ్యంపై చేసిన ఎన్నో అధ్యయనాల ప్రకారం చూస్తే,కొబ్బరి నూనెతో ఆహారాన్ని వండడం వలన కడుపు నిండిన అనుభూతి ఇస్తుంది. ఇది ఆఖలిని కూడా నియంత్రిస్తుంది. అలాగే ఊబకాయాన్ని నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది…
వేడి నీటితో : కొబ్బరి నూనెను వంటల్లో వాడటమే కాకుండా బరువు తగ్గటానికి మీరు నిత్యం ఖాళీ కడుపుతో ఒక కప్పు వేడి నీటిలో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను వేసుకొని తాగొచ్చు. ఇలా చేయడం వలన బరువును నియంత్రించడంతో పాటు జీర్ణం మరియు కడుపునొప్పి, విరేచనాలు లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని పొందవచ్చు. నిజానికి ఈ కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. మీరు గనక బరువు తగ్గాలి అని అనుకుంటే ప్రతిరోజు నిత్యం కొబ్బరి నూనెను గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగండి…
Weight Lose : కొబ్బరి నూనెను ఇలా వాడితే చాలు… ఈజీగా బరువు తగ్గొచ్చు…!!
కాఫీలో కొబ్బరినూనె : కాఫీలో కొబ్బరి నూనెను కలుపుకొని తాగటం వలన జీవక్రియ రేటు అనేది పెరుగుతుంది. అయితే ఈ కొబ్బరి నూనె మరియు కెఫిన్ కలిపి కెటోసిన్ ప్రక్రియను ప్రేరేపిస్తుంది. అలాగే ఇది కేలరీలను కూడా చేస్తుంది…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
This website uses cookies.