Weight Lose : కొబ్బరి నూనెను ఇలా వాడితే చాలు… ఈజీగా బరువు తగ్గొచ్చు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Weight Lose : కొబ్బరి నూనెను ఇలా వాడితే చాలు… ఈజీగా బరువు తగ్గొచ్చు…!!

Weight Lose : మీ ముఖం మరియు జుట్టు అందాన్ని పెంచడానికి మీరు కొబ్బరి నూనెను ఎన్నోసార్లు వాడి ఉంటారు. అయితే మీరు బరువును తగ్గించుకోవడానికి కొబ్బరి నూనె కూడా హెల్ప్ చేస్తుంది అనే విషయం మీకు తెలుసా. అలాగే ఊబకాయం తీవ్రమైన పరిణామాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నో సార్లు హెచ్చరించింది. అలాగే అధిక ఊబకాయం అనేది ఇతర తీవ్రమైన వ్యాధులకు కూడా కారణం అవుతుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీ బరువును […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 September 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Weight Lose : కొబ్బరి నూనెను ఇలా వాడితే చాలు... ఈజీగా బరువు తగ్గొచ్చు...!!

Weight Lose : మీ ముఖం మరియు జుట్టు అందాన్ని పెంచడానికి మీరు కొబ్బరి నూనెను ఎన్నోసార్లు వాడి ఉంటారు. అయితే మీరు బరువును తగ్గించుకోవడానికి కొబ్బరి నూనె కూడా హెల్ప్ చేస్తుంది అనే విషయం మీకు తెలుసా. అలాగే ఊబకాయం తీవ్రమైన పరిణామాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నో సార్లు హెచ్చరించింది. అలాగే అధిక ఊబకాయం అనేది ఇతర తీవ్రమైన వ్యాధులకు కూడా కారణం అవుతుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీ బరువును తగ్గించడానికి ఎన్నో మార్గాలలో కొబ్బరి నూనెను వాడవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం…

కొబ్బరినూనె ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది : ఆరోగ్య నిపుణుల అభిప్రాయ ప్రకారం చూసినట్లయితే, ఈ కొబ్బరి నూనెలో గుండెకు ఎంతో ఆరోగ్యకరమైన లక్షణాలు ఉన్నాయి. ఇది మంచి వంటనూనే గా కూడా ఉపయోగపడుతుంది. ఈ కొబ్బరి నూనె అనేది బరువును నియంత్రించటంలో సహాయపడటమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడం వలన గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శరీరంలో కొవ్వు శాతం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో వాపు కూడా మొదలవుతుంది. అయితే దీని కారణం చేత కొవ్వు కణాలు అనేవి శరీరానికి తగినంత శక్తిని ఉత్పత్తి చేయలేవు. కానీ ఈ కొబ్బరినూనె లో ఉన్నటువంటి యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు శరీరంలోని ఇన్ ఫ్లవేషన్ ను నియంత్రించడం వలన కొవ్వు ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే సంతృప్త కొవ్వుతో సమృద్ధిగా ఉండడం వలన కొబ్బరి నూనెలో సహజమైన ఆకలిని తగ్గించే గుణాలు ఉన్నాయి. అయితే ఈ కొబ్బరి నూనెను తీసుకోవటం వలన ఒక వ్యక్తికి పదేపదే ఆహారం తినాలి అని అనిపించదు. దీంతో ఆ వ్యక్తి ఎక్కువ కేలరీలు తీసుకోకుండా ఉంటాడు.ఇది బరువు తగ్గేందుకు ఎంతో హెల్ప్ అవుతుంది…

బరువు తగ్గడానికి కొబ్బరి నూనెను ఇలా వాడండి : మీరు వంట కోసం వివిధ నూనెలకు బదులుగా కొబ్బరి నూనెను కూడా వాడవచ్చు. అయితే ఆరోగ్యంపై చేసిన ఎన్నో అధ్యయనాల ప్రకారం చూస్తే,కొబ్బరి నూనెతో ఆహారాన్ని వండడం వలన కడుపు నిండిన అనుభూతి ఇస్తుంది. ఇది ఆఖలిని కూడా నియంత్రిస్తుంది. అలాగే ఊబకాయాన్ని నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది…

వేడి నీటితో : కొబ్బరి నూనెను వంటల్లో వాడటమే కాకుండా బరువు తగ్గటానికి మీరు నిత్యం ఖాళీ కడుపుతో ఒక కప్పు వేడి నీటిలో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను వేసుకొని తాగొచ్చు. ఇలా చేయడం వలన బరువును నియంత్రించడంతో పాటు జీర్ణం మరియు కడుపునొప్పి, విరేచనాలు లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని పొందవచ్చు. నిజానికి ఈ కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. మీరు గనక బరువు తగ్గాలి అని అనుకుంటే ప్రతిరోజు నిత్యం కొబ్బరి నూనెను గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగండి…

Weight Lose కొబ్బరి నూనెను ఇలా వాడితే చాలు ఈజీగా బరువు తగ్గొచ్చు

Weight Lose : కొబ్బరి నూనెను ఇలా వాడితే చాలు… ఈజీగా బరువు తగ్గొచ్చు…!!

కాఫీలో కొబ్బరినూనె : కాఫీలో కొబ్బరి నూనెను కలుపుకొని తాగటం వలన జీవక్రియ రేటు అనేది పెరుగుతుంది. అయితే ఈ కొబ్బరి నూనె మరియు కెఫిన్ కలిపి కెటోసిన్ ప్రక్రియను ప్రేరేపిస్తుంది. అలాగే ఇది కేలరీలను కూడా చేస్తుంది…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది