Egg : మనం రెగ్యులర్ గా గుడ్డును తింటూనే ఉంటాం. అయితే గుడ్డుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అధిక ప్రోటీన్లు ఉన్న ఆహారంగా గుడ్డుకు పేరుంది. అందుకే నిత్యం ఆహారంలో గుడ్డును తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే గుడ్డు తింటే బాడీకి చాలానే విటమిన్లు అందుతుంటాయి. అంతే కాకుండా గుడ్డుతో కేవలం ఆరోగ్యమే కాకుండా అందం కూడా మీ సొంతం అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. గుడ్డులోని తెల్ల సొనతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం అవుతుందని అంటున్నారు. గుడ్డులోని తెల్లసొనను ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి.
కాగా ఈ ఫేస్ ప్యాక్ కొంచెంసేపు ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వేసుకుంటే వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలను, మచ్చలను అలాగే గీతలను కూడా రాకుండా నియంత్రిస్తుంది. అయితే ఇలా కడిగేసుకున్న తర్వాత రెండుసార్లు పూతలా ప్యాక్ వేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ అరగంట సేపు ఆరిపోయిన తర్వాత ముఖం కాస్త ఫిట్ గా మారుతుంది. అప్పుడు చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఎలాంటి ఫేస్ ప్యాక్ లేకుండా సబ్బుతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. అరగంట సేపు ఉంచిన తర్వాత ముఖం బిగుతుగా మారిపోతుంది.
ఇలా వారంలో కనీసం రెండుసార్లు పూత వేసుకోవడం వల్ల ముఖం చాలా యవ్వనంగా కనిపిస్తుంది. అంతే కాకుండా దీనితో మరో ప్రయోజనం కూడా ఉందండోయ్. అదేంటంటే ఇది కళ్ల కింద వాపును కూడా తగ్గించేస్తుంది. కంటి కింది భాగాన్ని తెల్లసొనను క్రీమ్ లాగా పూసుకుని మృదువుగా మర్దన చేసుకోవాలి. అలా చేసుకుని ఆరిన తర్వాత కడుక్కోవాలి. ఎలాంటి మరకలు లేకుండా క్లీన్ గా కడుక్కోవాలి. ఇలా చేస్తూ ఉంటే కండ్లకు ఉండే వాపు కూడా తగ్గుతుంది. దాంతో పాటు ముఖంపై మచ్చలను కూడా తగ్గించుకోవచ్చు. గుడ్డు సొనలో టీట్రీ ఆయిల్ వేసి బాగా కలుపుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి.
ఇలా చేస్తే ముఖంపై ఉండే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. ఆక ఆయిల్ స్కిన్ ఉన్న వారు కూడా తెల్లసొనను ముఖానికి రాసుకుంటే చర్మంపై ఉండే ఆయిల్ తొలగిపోయి ముఖం మృదువుగా అయిపోతుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.