Egg : గుడ్డుతో ఇలా చేస్తే మెరిసే చర్మం మీ సొంతం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Egg : గుడ్డుతో ఇలా చేస్తే మెరిసే చర్మం మీ సొంతం..!

Egg : మనం రెగ్యులర్ గా గుడ్డును తింటూనే ఉంటాం. అయితే గుడ్డుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అధిక ప్రోటీన్లు ఉన్న ఆహారంగా గుడ్డుకు పేరుంది. అందుకే నిత్యం ఆహారంలో గుడ్డును తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే గుడ్డు తింటే బాడీకి చాలానే విటమిన్లు అందుతుంటాయి. అంతే కాకుండా గుడ్డుతో కేవలం ఆరోగ్యమే కాకుండా అందం కూడా మీ సొంతం అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. గుడ్డులోని తెల్ల సొనతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే మెరిసే […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 May 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Egg : గుడ్డుతో ఇలా చేస్తే మెరిసే చర్మం మీ సొంతం..!

Egg : మనం రెగ్యులర్ గా గుడ్డును తింటూనే ఉంటాం. అయితే గుడ్డుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అధిక ప్రోటీన్లు ఉన్న ఆహారంగా గుడ్డుకు పేరుంది. అందుకే నిత్యం ఆహారంలో గుడ్డును తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే గుడ్డు తింటే బాడీకి చాలానే విటమిన్లు అందుతుంటాయి. అంతే కాకుండా గుడ్డుతో కేవలం ఆరోగ్యమే కాకుండా అందం కూడా మీ సొంతం అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. గుడ్డులోని తెల్ల సొనతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం అవుతుందని అంటున్నారు. గుడ్డులోని తెల్లసొనను ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి.

Egg ముఖంపై గీతలు రాకుండా..

కాగా ఈ ఫేస్ ప్యాక్ కొంచెంసేపు ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వేసుకుంటే వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలను, మచ్చలను అలాగే గీతలను కూడా రాకుండా నియంత్రిస్తుంది. అయితే ఇలా కడిగేసుకున్న తర్వాత రెండుసార్లు పూతలా ప్యాక్ వేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ అరగంట సేపు ఆరిపోయిన తర్వాత ముఖం కాస్త ఫిట్ గా మారుతుంది. అప్పుడు చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఎలాంటి ఫేస్ ప్యాక్ లేకుండా సబ్బుతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. అరగంట సేపు ఉంచిన తర్వాత ముఖం బిగుతుగా మారిపోతుంది.

Egg గుడ్డుతో ఇలా చేస్తే మెరిసే చర్మం మీ సొంతం

Egg : గుడ్డుతో ఇలా చేస్తే మెరిసే చర్మం మీ సొంతం..!

ఇలా వారంలో కనీసం రెండుసార్లు పూత వేసుకోవడం వల్ల ముఖం చాలా యవ్వనంగా కనిపిస్తుంది. అంతే కాకుండా దీనితో మరో ప్రయోజనం కూడా ఉందండోయ్. అదేంటంటే ఇది కళ్ల కింద వాపును కూడా తగ్గించేస్తుంది. కంటి కింది భాగాన్ని తెల్లసొనను క్రీమ్ లాగా పూసుకుని మృదువుగా మర్దన చేసుకోవాలి. అలా చేసుకుని ఆరిన తర్వాత కడుక్కోవాలి. ఎలాంటి మరకలు లేకుండా క్లీన్ గా కడుక్కోవాలి. ఇలా చేస్తూ ఉంటే కండ్లకు ఉండే వాపు కూడా తగ్గుతుంది. దాంతో పాటు ముఖంపై మచ్చలను కూడా తగ్గించుకోవచ్చు. గుడ్డు సొనలో టీట్రీ ఆయిల్ వేసి బాగా కలుపుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి.

ఇలా చేస్తే ముఖంపై ఉండే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. ఆక ఆయిల్ స్కిన్ ఉన్న వారు కూడా తెల్లసొనను ముఖానికి రాసుకుంటే చర్మంపై ఉండే ఆయిల్ తొలగిపోయి ముఖం మృదువుగా అయిపోతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది