Mangoes : వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పండు మామిడి. ఇది వేసవి కాలంలో దొరికే మంచి పోషకాలు ఉన్న పండు. అందుకే మామిడిని చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వయసు వారి దాకా అందరూ తింటుంటారు. కాగా మామిడి పండ్లను ఇంత మండే వేసవిలో తినేందుకు కూడా ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. అయితే మామిడి పండ్లను తినేముందు కొంతమంది నేరుగానే తినేస్తుంటారు. ఇలా తింటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే మామిడి పండ్లపై ఎన్నో మలినాలు కూడా ఉంటాయి.
ఈ మధ్య మామిడి పండ్లు ఎక్కువ రోజులు నిలువ ఉంచేందుకు కొన్ని రసాయనాలను కూడా వాటిపై అప్లై చేస్తున్నారు. ఇవి శరీరానికి చాలా ప్రమాదకరం. ఇవి శ్వాస సంబంధిత సమస్యలు, వికారం, వాంతులు, జీర్ణ సంబంధిత సమస్యలను తీసుకొస్తున్నాయి. అందుకే మామిడి పండ్లను తినే ముందు అరగంట సేపు నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా చేస్తే మామిడి పండ్లపై ఉండే రసాయనాలు తొలగిపోతాయి. దాంతో పాటు వాటిపై ఉండే రకరకాల వైరస్ లు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. వేసవికాలంలో బాడీని చల్లగా ఉంచుకుంటేనే చాలా బెటర్.
కాబట్టి మామిడికాయలను నీటిలో నానబెట్టుకుని తింటే బాడీ చల్లగా ఉంటుంది. దాంతో పాటు మామిడి తొక్కలో ఫైటిక్ యాసిడ్ అనే యాంటీ న్యూట్రియంట్ ఉంటుంది. ఇది బాడీకి చాలా ప్రమాదకరం. మామిడి కాయలను నేరుగా తింటే పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. ఫైటిక్ యాసిడ్ ఐరన్, జింక్, కాల్షియం లాంటివి బాడీ గ్రహించకుండా అడ్డుకుంటుంది. అయితే మామిడి కాయలను తినే ముందు నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ తొక్కలోని ఈ ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. వీటితో పాటు తొక్కలో ఉండే హానికరమైన పదార్థాలు కూడా తొలగిపోతాయి.
ఇలా ఎన్నో రకాల అనారోగ్యకరమైన వాటిని మామిడి పండ్లను నీటిలో నానబెట్టుకుని తింటే తొలగిపోతాయి. కాబట్టి మామిడి పండ్లను తినే సమయంలో నీటిలో నానబెట్టుకుని తింటే చాలా మంచిదని అంటున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.