
Diabetes : రెండు వారాల పాటు చక్కెరను మానేస్తే... శరీరంలో జరిగే మార్పులు ఇవే...!
Diabetes : మన రోజువారి జీవితంలో చక్కెరను అధికంగా వాడుతూ ఉంటాము. ఈ చక్కెర వాడకం మంచిది కాదు అని ఎంత మంది ఎన్ని చెప్పినా సరే మనం చీమలు లాగా ఆ చక్కెర పైన ఎక్కువ మక్కువ చూపిస్తాము. మనం రోజు తీసుకునే ఆహారంలో చక్కెర మోతాదు పెరిగే కొద్దిగా ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ చక్కెర తీసుకోవటం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి అంటున్నారు. అందువలన మీరు ఒక రెండు వారాల పాటు చక్కెర ను తీసుకోవడం మానేయండి. అప్పుడు మీ ఆరోగ్యంలో మార్పులు మీకే అర్థం అవుతాయి. మనం ఒక 15 రోజులపాటు చక్కెరను గనుక దూరం పెట్టినట్లయితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
చక్కెరతో చేసిన ఆహార పదార్థాలు అనేవి నోటికి ఎంతో రుచిగా ఉన్న దాని వెనక ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని అంటున్నారు. కేవలం మీరు ఒక 15 రోజులపాటు చక్కెరను మానేస్తే మన శరీరంలో జరిగే మార్పులను గమనించవచ్చు అని అంటున్నారు. అయితే మీరు కొద్ది రోజులపాటు షుగర్ లేని ఆహారం తీసుకోకపోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ చక్కెర వాడకాన్ని తగ్గించటం వలన రక్తనాళాల్లో ఉన్నటువంటి కొవ్వు కూడా కరుగుతుంది. అప్పుడు మెదడు కూడా మరమ్మత్తులు చేసుకుంటుంది. ఈ చక్కెర వాడకం అనేది కంటి చూపు పై కూడా ఎంతో ప్రభావం చూపుతుంది. ఈ చక్కెర ను మానేయడం వలన దృష్టి అనేది పెరుగుతుంది. మన శరీరంలో శక్తి స్థాయి కూడా ఎంతగానో పెరుగుతుంది. అంతేకాక రక్తనాళాల వాపులు కూడా తగ్గుతాయి. అలాగే మీకు తీపి తినాలని కోరిక కూడా తగ్గుతుంది. అంతేకాక మీకు ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే ముఖంలో ఉన్నటువంటి కొవ్వు అనేది కరిగి ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.
Diabetes : రెండు వారాల పాటు చక్కెరను మానేస్తే… శరీరంలో జరిగే మార్పులు ఇవే…!
చక్కెరను తీసుకోకపోవడం వలన రక్తంలో చక్కెర నిల్వలు కంట్రోల్లో ఉంటాయి. దీంతో మధుమేహ సమస్య కూడా తగ్గుతుంది. అయితే ఈ చక్కెర లేని ఆహారాన్ని తీసుకోవడం వలన కాలేయ పనితీరు కూడా ఎంతో మెరుగుపడుతుంది. అంతేకాక చక్కెరతో ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వలన దంతాలకు కూడా హానికరం. అలాగే చక్కెర లేని ఆహారాన్ని తీసుకోవటం వలన దంతాలు మరియు చిగుళ్ల సమస్య నుండి కూడా బయటపడవచ్చు. మీరు గనక కొద్ది రోజుల పాటు చక్కెర ను మానేసినట్లయితే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రలోకి రావడం గమనించవచ్చు. ఇది గుండె ఆరోగ్యానికి కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది. మీరు గనక చక్కెరను తీసుకోవటం మానేసినట్లయితే అధిక సమయం పాటు శక్తిని కోల్పోకుండా ఉంటారు. ఈ చక్కెర అనేది క్యాన్సర్ కు దారి తీస్తే, ఒత్తిడి అనేది శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను పెంచుతుంది. మీ ఆహారంలో చక్కెరను తగ్గించటం వలన ప్రమాదాలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. చక్కెరను తీసుకోవటం నియంత్రించడం వలన చర్మాన్ని మెరుగుపరచడంలో కూడా మేలు చేస్తుంది. మీకు తీపి తినాలి అనిపించినప్పుడు చక్కెరకి బదులుగా తేనె, బార్లీ, సైరఫ్ లేక స్టివియా లాంటి చక్కెర లేని పదార్థాలను తీసుకోవడం అలవాటు చేసుకోండి…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.