
I- Pill Tablet : ఐ పిల్ టాబ్లెట్ ఆ విషయంలో... ఎప్పుడు, ఎలా వాడాలో తెలుసా...?
I-Pill Tablet : నేటి యువత చెడుదారులు పడుతూ, కొందరు వివాహం కాకముందే గర్భనిరోధక మాత్రలను వినియోగిస్తున్నారు. వారు వివాహం కానందువలన గర్భం దాల్చవద్దు అని భావనతో ఇలాంటి గర్భనిరోధక మాత్రలను వాడుతూ ఉంటారు. అలాగే వివాహం అయినవారు తమకు అప్పుడే సంతానం వద్దు అనుకోని, గర్భనిరోధక మాత్రలను వాడుతూ ఉంటారు. గర్భనిరోధక మాత్రలు అనేది అవాంఛిత గర్భాన్ని నివారించటానికి మహిళలు ఉపయోగించే ఒక రకమైన మందు. ఈ టాబ్లెట్ హార్మోన్లను కలిగి ఉంటాయి. ఇది అండోత్సర్ఘము (ovulation ) జరగకుండా నిరోధిస్తాయి. లేదా స్పెర్ము గర్భాశయంలోకి ప్రవేశించకుండా నిరోధించగలదు. కిట్లలో ఎన్నో రకాల గర్భ నిరోధక మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. కానీ, బాగా పాపులర్ అయిన వాటిల్లో, ఐ -పిల్ కూడా ఒకటి, ఐ -పిల్ అనేది అత్యవసర గర్భ నిరోధక మాత్ర. అసూరక్షిత సంభోగం లేదా గర్భనిరోధక వైఫల్యం జరిగినప్పుడు గర్భం రాకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుంది.
I- Pill Tablet : ఐ పిల్ టాబ్లెట్ ఆ విషయంలో… ఎప్పుడు, ఎలా వాడాలో తెలుసా…?
ఈ ఐ -పిల్ ప్రధానంగా అవాంచిత గర్భాధారణను నివారించడానికి వినియోగిస్తుంటారు. అసూరక్షిత సంభోగం లేదా గర్భనిరోధక వైఫల్యం జరిగిన 72 గంటలలోపు తీసుకుంటే మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది కండోమ్ తిరిగిపోయినా లేదా గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం మరిచిపోయినా, ఈ ఐ -పీల్ అత్యవసర పరిస్థితుల్లో గర్భాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఈ టాబ్లెట్స్ మెడికల్ షాపుల్లో సులభంగా లభిస్తాయి. ఐ -పిల్ తీసుకున్న తర్వాత పనిచేయడం ప్రారంభిస్తుంది. దీన్ని అతిగా తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి.
ఐ -పిల్ వాడటం వల్ల కలిగే నష్టాలు : ఐ -పిల్ తీసుకున్న తర్వాత మీ రుతు చక్రంలో మార్పులు సంభవిస్తాయి. శ్రావణ ఆలస్యం కావడం, ముందుగా రావడం లేదా ఎక్కువగా రక్తస్రావం కావడం వంటివి కూడా జరగవచ్చు. కొంతమంది మహిళలు ఐ-పీల్ తీసుకున్నాక తర్వాత వికారం వాంతులు అనుభవిస్తారు. ఈ టాబ్లెట్ వాడకం వల్ల తలనొప్పి, మైకం కూడా రావచ్చు. టాబ్లెట్ తీసుకున్న తర్వాత కొంత మందికి కడుపునొప్పి కూడా వస్తుంది. ఇంకా రొమ్ము నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. ఐ-పీల్ తీసుకున్న తర్వాత అలసటగా కూడా ఉంటుంది.
ఐ-పిల్ అనే అత్యవసర గర్భనిరోధక మాత్ర ఇది శృగారం తర్వాత గర్భం రాకుండా నిరోధించడానికి ఉపయోగించబడుతుంది.దీనిని, శృగారానికి ముందు తీసుకోకూడదు, శృంగారం తర్వాత మాత్రమే దీన్ని ఉపయోగించాలి.
ఐ-పిల్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు : సురక్షితం కాని శృగారం జరిగిన 72 గంటల్లో ఈ మాత్రను తీసుకోవాలి. వీలైనంత త్వరగా తీసుకునే మంచి ఫలితం ఉంటుంది. ఐ-పీల్ అండం విడుదలను ఆలస్యం చేయడం ద్వారా లేదా స్పెర్ము అండని ఫలదీకరణం చేయకుండా నిరోధించడం ద్వారా పనిచేస్తుంది. ఈ టాబ్లెట్ తీసుకున్న తర్వాత వికారం వాంతులు తలనొప్పి, కడుపునొప్పి,అలసట, రొమ్ము నొప్పి, ఋతుచక్రంలో మార్పులు వంటివి దుష్ప్రభావాలు కనిపించవచ్చు. ఈ టాబ్లెట్స్ ని తరచూ వాడకూడదు. సాధారణ గర్భ నిరోధక పద్ధతి కాదు. ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే వైద్యులు సంప్రదించి వారి సలహా తీసుకుంటే ఉత్తమం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.