Is Curd Vs Buttermilk good for health
పాలు, పెరుగు, మజ్జిగ లాంటివి అన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంటాయి. చాలామంది పెరుగు, పాలు, మజ్జిగ లేకుండా అన్నం కంప్లీట్ అవదు.. పాల నుండి పెరుగు దాన్నుంచి మజ్జిగ వచ్చినప్పటికీ చాలా తేడా ఉంటుంది. అవి అందించి పోషకాలు లాభాలు కూడా భిన్నంగానే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పాలు, పెరుగు బదులుగా మజ్జిగ తాగాలని వైద్యనిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఈ మూడు శరీరంలో ప్రతిస్పందించే విధానంలో మార్పులే దానికి కారణమని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇది వేడిని తాకినప్పుడు పులియ పెడుతుంది. అది కడుపులోకి వచ్చినప్పుడు కూడా పొట్టలోని వేడి కారణంగా పులియబెట్టడం జరుగుతుంది. దాని వల్ల కడుపులోని పేగులు వేడెక్కుతూ ఉంటాయి.
Is Curd Vs Buttermilk good for health
అయితే పెరుగు నుంచి వచ్చిన మజ్జిక మాత్రం శరీరాన్ని చల్ల భరుస్తుంది. అని వైద్యనిపుణులు చెప్తున్నారు వారి పరిశోధనల ప్రకారం మజ్జిగ అన్ని విధాలుగా శరీరానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పెరుగు కంటే మజ్జిగ చాలా మంచిదని తెలిపారు. పెరుగు కొవ్వు బలాన్ని పెంచుతూ ఉంటాయి. వాత తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇంకా పెరుగును అందరు తీసుకోలేరు.. మజ్జిగ ఉపయోగాలు : పెరుగు బదులు దాని నుండి వచ్చే మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మంచిది. మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి, పింకు సాల్టు కొత్తిమీర వేసి తీసుకుంటే రుచి చాలా గొప్పగా ఉంటుంది. ఇంకా మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది న్యాయం చేసింది. జీర్ణక్రియను మెరుగుపడేలా చేస్తుంది. ఈజీగా జర్ణమవుతుంది.
జీర్ణ సమస్యలు, వాపు సమస్యలు రక్తహీనత ఆకలి లేకపోవడం అలాంటి సమస్యలనుంచి ఉపశమనం కలుగుతుంది. శీతాకాలంలో అయితే అజీర్ణం సమస్య ఎదురవకుండా నివారిస్తుంది. మజ్జిగ తేలికగా ఉండడం వల్ల జీర్ణమవ్వడం చాలా ఈజీ. ఆకలి ప్రేరేపించడానికి బాగా ఉపయోగపడుతుంది. అదే పెరుగు తీసుకుంటే జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. మలబద్ధకం, గ్యాస్ట్రిక్ లేదా ఆక్సిడెంట్ లాంటి జీర్ణ సమస్యలు ఉంటే మజ్జిగ చక్కని ఎంపిక. ఇంకా మజ్జిగ శరీర బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. బరువు పెరగాలంటే పెరుగు బరువు తగ్గాలంటే మజ్జిగ తీసుకోవాలి. పెరుగుని ఎవరు తినకూడదు… ఊబకాయం ,కఫా రుగ్మతలు, రక్తస్రావం, వాపు ,
Is Curd Vs Buttermilk good for health
ఆర్థరైటిస్ ఉన్నవాళ్లు పెరిగికి దూరంగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. అలాగే రాత్రి సమయంలో పెరుగు తినకూడదని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. ఎందుకనగా ఇది దగ్గు సైనస్, జలుబు లాంటి సమస్యలను ఎక్కువ అయ్యేలా చేస్తుంది. ఒకవేళ రాత్రి సమయంలో పెరుగు తినకుండా ఉండలేని అనుకుంటే అందులో చిటికెడు మిరియాలు లేదా మెంతులు వేసుకొని తినడం మంచిది.. పెరుగు వేడి చేయడం వలన దాంట్లోనే మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. చాలామంది పెరిగిన వేడి చేసి మజ్జిగ చారు లాంటివి చేస్తూ ఉంటారు. అయితే అది తరచూ తింటున్న వారి శరీరంపై మాత్రమే తట్టుకోగలరు. బరువు తగ్గాలనుకునే వారు మజ్జిగ తీసుకోవాలి. పెరుగుకి దూరంగా ఉండాలి.
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
This website uses cookies.