Mangoes : మామిడి పండ్లను నీళ్లలో కడిగి తినకపోతే ఇంత ప్రమాదమా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mangoes : మామిడి పండ్లను నీళ్లలో కడిగి తినకపోతే ఇంత ప్రమాదమా..?

 Authored By ramu | The Telugu News | Updated on :11 May 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Mangoes : మామిడి పండ్లను నీళ్లలో కడిగి తినకపోతే ఇంత ప్రమాదమా..?

Mangoes : వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పండు మామిడి. ఇది వేసవి కాలంలో దొరికే మంచి పోషకాలు ఉన్న పండు. అందుకే మామిడిని చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వయసు వారి దాకా అందరూ తింటుంటారు. కాగా మామిడి పండ్లను ఇంత మండే వేసవిలో తినేందుకు కూడా ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. అయితే మామిడి పండ్లను తినేముందు కొంతమంది నేరుగానే తినేస్తుంటారు. ఇలా తింటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే మామిడి పండ్లపై ఎన్నో మలినాలు కూడా ఉంటాయి.

Mangoes : అరగంట నానబెట్టుకుంటే..

ఈ మధ్య మామిడి పండ్లు ఎక్కువ రోజులు నిలువ ఉంచేందుకు కొన్ని రసాయనాలను కూడా వాటిపై అప్లై చేస్తున్నారు. ఇవి శరీరానికి చాలా ప్రమాదకరం. ఇవి శ్వాస సంబంధిత సమస్యలు, వికారం, వాంతులు, జీర్ణ సంబంధిత సమస్యలను తీసుకొస్తున్నాయి. అందుకే మామిడి పండ్లను తినే ముందు అరగంట సేపు నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా చేస్తే మామిడి పండ్లపై ఉండే రసాయనాలు తొలగిపోతాయి. దాంతో పాటు వాటిపై ఉండే రకరకాల వైరస్ లు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. వేసవికాలంలో బాడీని చల్లగా ఉంచుకుంటేనే చాలా బెటర్.

Mangoes మామిడి పండ్లను నీళ్లలో కడిగి తినకపోతే ఇంత ప్రమాదమా

Mangoes : మామిడి పండ్లను నీళ్లలో కడిగి తినకపోతే ఇంత ప్రమాదమా..?

కాబట్టి మామిడికాయలను నీటిలో నానబెట్టుకుని తింటే బాడీ చల్లగా ఉంటుంది. దాంతో పాటు మామిడి తొక్కలో ఫైటిక్ యాసిడ్ అనే యాంటీ న్యూట్రియంట్ ఉంటుంది. ఇది బాడీకి చాలా ప్రమాదకరం. మామిడి కాయలను నేరుగా తింటే పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. ఫైటిక్ యాసిడ్‌ ఐరన్‌, జింక్, కాల్షియం లాంటివి బాడీ గ్రహించకుండా అడ్డుకుంటుంది. అయితే మామిడి కాయలను తినే ముందు నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ తొక్కలోని ఈ ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. వీటితో పాటు తొక్కలో ఉండే హానికరమైన పదార్థాలు కూడా తొలగిపోతాయి.

ఇలా ఎన్నో రకాల అనారోగ్యకరమైన వాటిని మామిడి పండ్లను నీటిలో నానబెట్టుకుని తింటే తొలగిపోతాయి. కాబట్టి మామిడి పండ్లను తినే సమయంలో నీటిలో నానబెట్టుకుని తింటే చాలా మంచిదని అంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది