jackfruit powder benefits for diabetes
Diabetes : ఈ మధ్య డయాబెటిస్ చాలా మందిని వేధిస్తోంది. ఊబకాయం తర్వాత అతి ఎక్కువ మందిని వేధించే సమస్యగా తయారైంది మధుమేహం. చిన్న వయస్సు వారిలోనూ డయాబెటిస్ కనిపిస్తోంది. చాప కింద నీరులా మధుమేహం వ్యాపిస్తూ వస్తోంది. డయాబెటిస్ రోగులు పచ్చి పసన పొడి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర గ్లైకోసైలేటెడ్ హిమోగ్లోబిన్( హెచ్‌బిఏ 1సి ) ను తగ్గిస్తుందని కొందరు పరిశోధకుల పలు అధ్యయనాల్లో కనుగొన్నారు. మధుమేహం జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం టైప్ 2 డయాబెటిస్ రోగుల్లో గ్లైసెమిక్ నియంత్రణను మెరుగు పరచడంలో ఈ పనస పౌడర్ యొక్క చికిత్సా సామర్థ్యం బయట పడింది. ఈ మధ్య కాలంలో ఈ పనస పొడి అన్ని ఆన్ లైన్ సైట్లలో అందుబాటులో ఉంటోంది.పచ్చి పనస కాయ పొట్టుు కూరలలో వాడటం అందరికీ తెలిసిందే.
అయితే ఈ పనస పొడని శ్రీలంక మరియు కేరళలో వండిన బియ్యానకి సాంప్రదాయక కూరగా వాడతారు. పిండి రూపంలో గ్రీన్ ఇడ్లీ, ఉప్మా లేదా రోటీ వంటి వివిధ రకాల రోజూ వారీ ఆహారాలతో కలపడం మరింత సులభంగా ఉంటుంది.భారత్ లో చాలా మంది తగినంత మేర పండ్లను, కూరగాయలను తీసుకోరు. దానికి బదులుగా రిఫైన్డ్ ప్రాసెస్డ్ చేసిన బియ్యం మరియు గోధుమలపై ఆధారపడతారు. ఒక చెంచా బియ్యం లేదా గోధుమ పిండిని పనసతో భర్తీ చేసినప్పుడు, కార్బోహైడ్రేట్ మోతాదు తగ్గుతుంది. ఇది వినియోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో పెద్ద తేడాను మనం గుర్తించవచ్చు. కేలరీలు కూడా తగ్గుతాయి. ఇది బరువు తగ్గాలనుకునేవారికి సాయపడుతుంది. అంతే కాకుండా మల బద్దకం సమస్యల ఉన్న వారికి ఉపయోగపడే పోషకాలు ఇందోల ఎక్కువగా ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఫైబర్. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది.
jackfruit powder benefits for diabetes
మధుమేహం ఉన్న వారిలో లేదా రక్తంలో చక్కెరు నియంత్రించడంలో పస పౌడర్ సాయపడుతుంది.
చెడు కొలెస్ట్రాల్ స్థాయి మరియు ఊబకాయం సమస్యను తగ్గిస్తుంది.
పనస పౌడర్ ను తరచూ తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.
ఇది శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేందుకు తోడ్పడుతుంది.
కార్బోహైడ్రేట్లను తగ్గించడానికి సాయపడుతుంది.
బియ్యం, గోధుమతో పోలిస్తే తక్కువ స్థాయిలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి.
రోగ నిరోధక శక్తికి ఇది బూస్టర్ గా పని చేస్తుంది.
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
This website uses cookies.