Ram Charan : ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్, తన 15వ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.అది కూడా క్రియేటివ్ జీనియస్ అయినా శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరమీదకు రాబోతుంది.ఈ సినిమాకు దిల్ రాజ్ నిర్మాత కాగా తన సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియ్రేషన్స్‌లో 50వ చిత్రంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా రామ్ చరణ్ కు మైల్ స్టోన్ మూవీ 15వ సినిమా కావడం ఒక విశేషం. అయితే రామ్ చరణ్ నటించబోయే పాత్ర ఎన్నికల కమిషనర్.ఇందులో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. కీలక పాత్రల్లో అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్ నటించబోతున్నారు.ఈ సినిమా రీసెంట్ గా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రారంభమైంది.
ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. రామ్ చరణ్, కియారాలతో పాటు తదితర నటీనటులు కూడా ఈ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా నెల రోజుల పాటు రాజమండ్రి లోనే సాగనుంది.ఇక దర్శకుడు శంకర్ తన గత చిత్రాల లాగానే రామ్ చరణ్ 15వ సినిమాను కూడా ఓ సామాజిక అంశాన్ని ఆధారంగా తీసుకొని హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందించనున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ ఎన్నికల కమీషనర్‌గా కనిపించగా. ఇక ఈ సినిమాలో సీయం పాత్రలో తమిళ దర్శకుడు, నటుడు ఎస్. జే.సూర్య నటించబోతున్నారు.అయితే శంకర్ – అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ఒకే ఒక్కడు సినిమాలోలాగానే ఎన్నికల కమీషనర్‌కు సీయం కు మధ్య వచ్చే ఇగో క్లాష్ నేపథ్యంలోనే ఈ సినిమా కథ కూడా ఉండబోతుందని సినీ వర్గాల్లో టాక్ గా వినిపిస్తోంది.
అయితే ముందునుంచి రామ్ చరణ్ 15వ సినిమాలో శ్రీకాంత్ విలన్ అనే వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు విలన్ గా సూర్య అని చెప్పుకుంటున్నారు. యస్.జే.సూర్య నటిస్తున్న సీయం పాత్రే చరణ్ 15 వ సినిమాలో మెయిన్ విలన్ అని సినిమా వర్గాల సమాచారం. ఇంతకముందు సూర్య సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ‘స్పైడర్’ సినిమా లో సైకో విలన్ గా పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నాడు సూర్య. అంతేకాకుండా కోలీవుడ్ స్టార్ అయినా హీరో దళపతి విజయ్ నటించిన ‘మెర్సల్’ సినిమాలోనూ విలన్‌గా సూర్య నటించి ప్రేక్షకుల ప్రశంసలను పొందారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న 15వ చిత్రంలో మెయిన్ విలన్ గా నటించనున్న సూర్య పాత్ర ఏ విధంగా ఉండబోతుందో చూడాలి.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.