Lifestyle : వందేళ్లు సంతోషంగా జీవించు అని ఆశీర్వాదం తీసుకున్న టైంలో పెద్దలు సాధారణంగా దీవించే ఆశీర్వాదం ఇదే. అయితే 100 ఏళ్ళు జీవించడం అనేది అంత సులభమైన విషయం కాదు అనే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం 1000 మందిలో ఒకరు కూడా వందేళ్లు జీవించని పరిస్థితి ఉన్నది. అయితే మారుతున్నటువంటి జీవనశైలి మరియు మనం తీసుకుంటున్న ఆహారంలో మార్పుల వలన వందేళ్లు బతకడం అనేది వింతగా మారింది. అయితే మన జీవన విధానంలో చేసుకునే కొన్ని మార్పుల వలన వందేలు బతకడం పెద్ద కష్టం ఏమి కాదు అని నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వందేళ్లు కు పైగా జీవిస్తున్నటువంటి వారికి సంబంధించిన అధ్యయనం చేసినటువంటి పరిశోధకులు ఆ వివరాలను జీరో సైన్స్ అనే జర్నల్ లో ప్రచూరించడం జరిగింది. అయితే మంచి ఆహారంతో పాటుగా బరువును అదుపులో ఉంచుకోవడం వలన వృద్ధాప్యాన్ని కూడా జయించవచ్చు అని పరిశోధకులు అంటున్నారు. అయితే జన్యుపరమైన కారకాలు ఆయుష్ పై ఎంతో ప్రభావం చూపుతాయని నిపుణులు గుర్తించారు. అలాగే ఎక్కువ కాలం జీవించినప్పటికీ వారిలో కామన్ గా కనిపించే నాలుగు అలవాట్లు గురించి పరిశోధకులు తెలిపారు. ఆ నాలుగు అలవాట్లు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
* మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఉప్పు చాలా తక్కువగా తీసుకోవడం వలన జీవన నాణ్యత అనేది పెరుగుతుంది అని అంటున్నారు. అంతేకాక తొందరగా వృద్ధాప్యం రావడానికి ముఖ్య కారణాలలో ఉప్పు ను అధికంగా తీసుకోవటం కూడా ఒక కారణం అని నిపుణులు అంటున్నారు. ఇక పోతే స్మోకింగ్ కూడా అకాల మరణానికి ఒక కారణం అని కూడా అంటున్నారు. * ఎక్కువ కాలం జీవించాలి అని అనుకునేవారు ముందు నిద్రలేమి సమస్యల నుండి బయట పడాలి అని నిపుణులు అంటున్నారు. అలాగే నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారు తొందరగా వృద్ధాప్య ఛాయలు వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా అంటున్నారు నిపుణులు. అయితే రోజులో కనీస ఎనిమిది నుండి తొమ్మిది గంటల నాణ్యమైన నిద్ర ఉంటేనే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అని అంటున్నారు.. •
* ఒంటి నొప్పులకు మరియు జలుబుకు ఇలా ఎన్నో చిన్న సమస్యలు వచ్చిన వెంటనే మందులు వేసుకునే వారిలో కూడా వృద్ధాప్య లక్షణాలు అనేవి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. వీలైనంత వరకు చాలా తక్కువ మోతాదులో మందులు తీసుకోవాలి అని నిపుణులు అంటున్నారు. మీరు మందులో వాడకాన్ని తగ్గిస్తే శరీరంలో సహజంగా రోగ నిరోధక శక్తి అనేది కూడా పెరుగుతుంది. ఇది ఎక్కువ కాలం జీవించేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది.. * పట్టణ ప్రాంతాలా జీవన విధానంతో పోల్చినట్లయితే గ్రామీణ జీవనశైలి అధిక కాలం జీవించేందుకు ఉపయోగంగా ఉంటుంది అని నిపుణులు అంటున్నారు. అయితే గ్రామీణ ప్రాంతంలో జీవన విధానం అనేది ఎక్కువకాలం జీవించేందుకు ఉపయోగపడుతుంది అని టిఫినులు అంటున్నారు. ఈ గ్రామీణ జీవన విధానం అనేది దీర్ఘాయువు కు గణనీయంగా హెల్ప్ చేస్తుందని పరిశోధనలో తేలింది. అలాగే వాకింగ్ చేయడం మరియు ఎక్కువ టైం పకృతిలో గడపడం వలన కూడా ఆయుష్ పెరగే అవకాశం ఉంటుంది అని పరిశోధనలో తేలింది…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.