
#image_title
Over Weight : ప్రస్తుత కాలంలో ఎంతో మంది స్థూలకాయ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే అధిక బరువును తగ్గించుకొనేందుకు జిమ్ లో గంటల తరబడి చమటోర్చటం మరియు డైటింగ్ మరియు ఆహారంలో మార్పులు లాంటివి చేస్తూ ఉన్నారు. ఇంకా బరువు తగ్గించే ఖరీదైనటువంటి శాస్త్ర చికిత్సలు కూడా చేయించుకుంటూ ఉంటారు. అయితే అధిక బరువు విషయంలో అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. దీనికి కొన్ని చిట్కాలు పాటిస్తే బరువు ను ఈజీగా తగ్గించుకోవచ్చు అని అంటున్నారు నిపుణులు. అయితే మీరు బరువు తగ్గడానికి ఉదయం డ్రింక్ ఒకటి సరిపోదు. మీరు గనక తక్కువ టైంలో బరువు తగ్గాలి అని అనుకుంటే రాత్రి పడుకునే ముందు కొన్ని పానీయాలను తీసుకున్నట్లయితే చాలా మంచిది అని వేగంగా బరువు తగ్గుతారు అని నిపుణులు అంటున్నారు. అయితే రాత్రి నిద్ర కు ముందు తాగాల్సిన పానీయాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
రాత్రి పడుకునే ముందు తీసుకోవలసిన పానీయాలు : గ్రీన్ టీ : గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు కాటెచిన్స్ అనేవి సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీవ క్రియను ఎంతగానో పెంచడానికి సహాయపడతాయి. ఇంకా కొవ్వూను కరిగించే ప్రక్రియను కూడా ఎంతో వేగవంతం చేస్తాయి. అంతేకాక రాత్రి పూట గ్రీన్ టీ తీసుకోవడం వలన శరీరంలో కొవ్వు అనేది తగ్గుతుంది. అలాగే నిద్ర కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఈ పానీయం రాత్రిపూట శక్తిని తగ్గించటంలో కూడా మేలు చేస్తుంది. ఇకపోతే అకాల ఆకలిని కూడా నియంత్రిస్తుంది… వాము నీరు : వాము నీరు కూడా బరువు తగ్గటానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మీ వాము నీటిని తయారు చేసుకోవడానికి నీటిలో వామును కొన్ని గంటల పాటు నానబెట్టి ఫిల్టర్ చేయాలి. మీకు వీలైతే కొంచెం వేడి చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఈ వాము నీరు అనేది పొట్ట సమస్యల నుండి ఉపశమనం కలిగించడంతో పాటుగా జీవక్రియను కూడా పెంచుతుంది. అలాగే రాత్రిపూట జర్ణ క్రియ ప్రక్రియను కూడా ఎంతో మెరుగుపరిచి బరువును తగ్గించేందుకు సహాయపడుతుంది…
వేడి నిమ్మ నీరు : నిమ్మకాయ రసాన్ని వేడి నీళ్లల్లో కలుపుకొని తీసుకోవటం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ఇవి బరువును తగ్గించటంలో కూడా ఎంతో బాగా పనిచేస్తాయి. అలాగే లెమన్ వాటర్ లో విటమిన్ సి అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరం నుండి విషపూరిత పదార్థాలను బయటకు పంపించడంలో కూడా మేలు చేస్తుంది. ఇకపోతే బరువును తగ్గించే ప్రక్రియను కూడా ఎంతో వేగవంతం చేయడంలో సహాయపడుతుంది… సెలెరీ జ్యూస్ : సెలెరీ చూసేందుకు కోతిమీర లా ఉంటుంది. కానీ దీనిలో ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి. ఇది రాత్రిపూట తాగడానికి సులభమైన మరియు ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది అని చెప్పొచ్చు. ఈ సెలేరీలో చాలా తక్కువ క్యాలరీలు మరియు అధిక నీటి కంటెంట్ ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. అలాగే రాత్రిపూట అనవసరమైన ఆకలిని కూడా నియంత్రిస్తుంది. ఇది మాత్రమే కాక నిర్విషీకరణలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంకా బరువు తగ్గేందుకు కూడా బాగా హెల్ప్ చేస్తుంది…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.