Late Marriage : తల్లిదండ్రులు తన చిన్న కూతురి పెళ్లి విషయంలో నాలుగు, ఐదు సంవత్సరాలుగా ఎంతో ఆందోళన పడుతున్నాడు. ప్రస్తుతం తండ్రి రిటైర్ అయ్యి కూడా ఆరు సంవత్సరాలు గడిచిపోయింది. అంతకు ముందు తన పెద్ద కుమార్తె పెళ్లి విషయంలో కూడా తగిన వరుడు దొరకపోవడం వలన చాలా ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం చిన్న కూతురి విషయంలో కూడా ఇలానే జరుగుతుంది. ప్రస్తుతం అమ్మాయికి 36 సంవత్సరాలు వచ్చేసాయి. అయితే బంధువులు,స్నేహితులు ఇంకెప్పుడూ పెళ్లి చేస్తావు అని అడిగితే ఏమని సమాధానం చెప్పాలో తెలియక నిట్టూర్పు విడుస్తున్నారు ఇద్దరు దంపతులు. ప్రస్తుతం ఆమె పెళ్లి విషయంలో తెలిసిన వారంతా కూడా చేతులు ఎత్తేశారు. మ్యాట్రిమొనీ సైట్లకు సబ్స్క్రైబ్ చేసుకోవటం తో వేల రూపాయలు ఖర్చు అయ్యాయి. అయితే అమ్మాయి చాలా తెలివైనది. ప్రస్తుత అమ్మాయి మంచి పొజిషన్లో కూడా ఉన్నది. అంతేకాక ఆరు అంకెల జీతం కూడా. దీని వలన ఆమెకు తగిన వరుడు దొరకటం అనేది చాలా కష్టం. పెళ్లీడు వచ్చినప్పుడు ఎన్నో సంబంధాలు వచ్చాయి. కానీ కెరీర్,ఉద్యోగం అంటూ వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు తీరా పెళ్లి చేద్దాం అనుకునేసరికి వరుడు దొరకక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రిటైర్ అయినటువంటి తండ్రి అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత హైదరాబాద్ను విడిచి తన సొంత ఊరుకొచ్చి సెటిల్ అయ్యి కాలం కడుపుదాము అని అనుకుంటున్నారు. కానీ ఎంత ప్రయత్నం చేసిన సంబంధాలు మాత్రం దొరకడం లేదు అనే ఆందోళన ఆయన 66 ఏళ్ల వయసులో తన కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి..
ట్రెండ్ గా మారిపోయింది : ఈ పరిస్థితి ప్రతి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారు. మెట్రో నగరాల్లో బాగా చదువుకొని కెరీర్ కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి ఉద్యోగాలలో సెటిల్ అవుతున్న చాలా మంది అమ్మాయిల పరిస్థితి ఇలాగే ఉన్నది. తమ కాళ్ల పై తాము నిలబడి ఉన్నత స్థానాలకు ఎదగాలి అనే కోరికతో పెళ్లిలను వాయిదాలు వేస్తూ వస్తున్నారు. మనదేశంలో పెళ్లి సగటు వయసు 24 నుండి 25 సంవత్సరాలు. ఇక మన దేశ చట్టాలు 1995 హిందూ వివాహ చట్టం ఆమోదించిన వయసు అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21.నిజం చెప్పాలంటే. ఒకప్పుడు బాల్యవివాహాలతో ఈ దేశం పెద్ద సమస్యల్లో ఉండేది. ఈ టైమ్ లో వాటిని అరికట్టటానికి ప్రభుత్వం నిర్దేశించిన కనీస వయసు పరిమితులు ఇవి. ఒక రకంగా చెప్పాలి అంటే. ప్రస్తుతం మెట్రో నగరాల్లో బాల్యవివాహాలకు బదులుగా ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం అనేది చాలా సాధారణంగా మారిపోయింది…
ఎందుకు ఆలస్యం : దీనికి కూడా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి వ్యక్తిగత ఆశయాలు అయితే, మరొకటి మనం ముందే చెప్పుకున్నట్లుగా పెళ్లికి ముందే సెటిల్ కావటం ముఖ్యం అని నగరంలో ఉన్న యువత భావిస్తున్నారు. దీంతో కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టి ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాత పెళ్లి అని అంటున్నారు. యువత తమకాళ్ల పై తాము నిలబడటం చాలా అవసరం అని అంటున్నారు. కానీ వారు సెటిల్ అయ్యేసరికి వారి వయసు 30 సంవత్సరాలు దాటిపోతుంది. మంచి ఉద్యోగం లభించి, ఆపై ప్రమోషన్ కూడా లభించి, వాళ్లు చెప్పుకోదగిన జీతం వచ్చేసరికి వాళ్లకి 35 ఏళ్లు దాటిపోతున్నాయి. అప్పటికి కూడా ఆగుతున్నారా అంటే లేదు. తమ స్థాయికి తగ్గట్టు వధు, వరులు అనగా వారి స్థాయి లేక అంతకన్నా ఎక్కువ వస్తాయి ఉన్నవారిని వెతకడం మొదలు పెడుతున్నారు. ఆ వెతకటంలో ఎవరికైనా మంచిది సంబంధం దొరికినట్లైతే వెంటనే చేసుకుంటున్నారు. కానీ ఎంత మందికి అదృష్టం అనేది తలుపు తడుతుంది. కొందరికి పెళ్లి సంబంధాలు వెతకటంలో రెండు మూడేళ్లు కూడా గడిచిపోతున్నాయి…
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం ఇప్పుడు జరిగే పరిస్థితుల్ని బట్టి కూడా చాలా మంది అదే మాటను చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్నటువంటి దేశం మనది. కానీ చేసుకోవలసిన వయసులో పెళ్లిళ్లు చేసుకోకుండా కెరీర్, ఉద్యోగం అంటూ వాటి వెంటపడి తర్వాత ప్రయాస పడినంత మాత్రాన ఎలాంటి లాభం ఉండదు అని అంటున్నారు. ఇది గనక ఇలా జరిగితే ముందు ముందు మన దేశంలో యువత సంఖ్య కూడా చాలా గణనీయంగా తగ్గుతుంది. అప్పుడు అమెరికా,జపాన్ దేశాలు లాగే మనదేశంలో కూడా వృద్ధుల సంఖ్య అనేది పెరుగుతుంది అని అంటున్నారు. ఇది కేవలం మానవ సంబంధాల విషయంలో మాత్రమే కాక దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా ఎంత ప్రభావం చూపుతుంది అని హెచ్చరిస్తున్నారు. ఇక ముందు వచ్చే జనరేషన్లో 60 ఏళ్ల తండ్రికి 15 ఏళ్ల కొడుకు ఉన్న ఎంతో ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇక ముందు ఇదే పరిస్థితి గనుక వస్తే ఆ తండ్రి బిడ్డ భవిష్యత్తుకు ఎటువంటి భరోసా ఇవ్వగలడు అని ప్రశ్నిస్తున్నారు..
గడిచిపోయిన కొన్ని సంవత్సరాలలో దేశంలో సంతాన ఉత్పత్తి రేటు అనేది చాలా తగ్గుతుంది. ఇదే పరిస్థితి గనక కొనసాగితే 2050 నాటికి భారత్లో సంతాన ఉత్పత్తి రేటు అనేది 1.29కి పడిపోతుంది అని 2024 మార్చిలో రిలీజ్ అయిన లాన్సెట్ నివేదిక హెచ్చరించింది. ప్రస్తుత కాలంలో ప్రతి చిన్న పట్టణంలో కూడా సంతార ఉత్పత్తి ఆస్పటల్ ఎన్నో పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. సాధారణ స్త్రీ మరియు పురుషుల సంతాన ఉత్పత్తి సామర్థ్యం అనేది 20 నుండి 30 సంవత్సరాలలో బాగా ఉంటుంది అనేది వైద్యుల మాట. కానీ 30 దాటిన తర్వాత కూడా పెళ్లి గురించి ఎటువంటి ఆలోచన లేనివారు, ఇక పిల్లల గురించి ఏమీ ఆలోచిస్తారు అనేది వైద్యులు ప్రశ్నిస్తున్నారు. అయితే 40 దాటిన తర్వాత కూడా ఐవిఎఫ్ కేంద్రాలకు వస్తున్నారు. 40 దాటిన తర్వాత పిల్లలు పుడితే ఆ పిల్లల పెంపక విషయంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయనే వాదనలు కూడా ఉన్నాయి..
మహిళల్లో శారీరక సమస్యలు : మనదేశంలో 30 దాటిన మహిళల్లో విటమిన్ డి, కాల్షియం, ఐరన్ లోపం అనేది చాలా ఎక్కువగా ఉన్నది. వయసు పెరుగుతున్న కొద్దీ వీటి సమస్యలు కూడా ఎక్కువగా పెరుగుతాయి. ఇక పురుషుల విషయానికి వస్తే 30 నుండి 35 ఏళ్లు మధ్యలో జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే వాటికి తోడుగా బీపీ, డయాబెటిస్ కూడా సాధారణం అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులు ఆరోగ్యవంతమైన బిడ్డలను ఎలా కడగలరు. 30 ఏళ్ల లోపు స్త్రీలలో అయితే అండాలు మరియు పురుషులలో వీర్యకణాలు అనేవి ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. వాటి కలయిక వలన పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారు. వీరి వయసు పెరిగే కొద్దీ వాటి శక్తి అనేది ఎంత తగ్గుతుంది..
మానసిక ఆరోగ్యం : కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాక మానసిక ఆరోగ్యం పై కూడా ఈ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది అని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా ఐవిఎఫ్ ద్వారా పిల్లల్ని కనే జంట మరొక బిడ్డను కనటానికి అసలు ఇష్టపడరు. దీనివలన దేశంలో ఉమ్మడి కుటుంబాల సంఖ్య అనేది నానాటికి కూడా అంతం అవుతుంది. అంతేకాక తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేయటం వలన ఒక్క బిడ్డకు కూడా అవసరమైన టైం అనేది కేటాయించడం లేదు. దీని వలన తల్లిదండ్రులు ఎంగేజ్ చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా తల్లి స్పర్శ మరియు తండ్రిలాలన తో సమానం కాకపోవటం వలన పిల్లలు ఒంటరిగా మిగిలిపోతున్నారు. అంటే ఒంటరితనం అనేది ఎంతగానో పెరుగుతుంది.
లాభాలు : ప్రస్తుతం లేట్ మ్యారేజ్ వలన లాభాలు కూడా ఉన్నాయి అని అంటున్నారు. అన్ని విధాల అభివృద్ధి చెందిన వైద్య సౌకర్యాల కారణం వలన 40 దాటిన తర్వాత కూడా పిల్లలను కనే అవకాశం ఉన్నది అని అంటున్నారు. పూర్తిగా సెటిల్ అయిన తర్వాత ఆర్థికంగా వెసులుబాటు అనేది వస్తుంది. కాబట్టి పిల్లలకు మంచి నాణ్యమైన భవిష్యత్తు ఇవ్వచ్చు అనేది వారి వాదన. గతంలో పెళ్లి అనగానే అబ్బాయి ఏం చేస్తున్నాడు అని మాత్రమే అడిగేవారు. తనకు కొద్దిగా సంపాదన ఉంటే చాలు పెళ్లి చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం అబ్బాయి తో పాటుగా అమ్మాయి కూడా ఏమి చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. విరు ఇద్దరూ ఉద్యోగాలు చేయటం వలన ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. అందుకే ఆరోగ్యపరంగా సంతోషంగా ఉండవచ్చు. లేట్ మ్యారేజెస్ వలన సరైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. చిన్న చిన్న విషయాలు కు తగువులాడుకొని విడిపోరు…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.