Afghanistan : టీ20 వరల్డ్ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ అద్భుతం చేసింది. లీగ్ మ్యాచ్‌లలోనే ఇంటి దారి పడుతుంది అనుకుంటే ఏకంగా సెమీస్ చేరింది. ఆస్ట్రేలియా లాంటి బలమైన టీమ్‌ని కూడా మట్టి కరిపించింది. సూపర్ 8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ సెమీ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది.. దర్జాగా. దీని దెబ్బకు ఆస్ట్రేలియాకు సెమీస్ దారులు మూసుకుపోయాయి. గత మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ ను 19 ఓవర్లకు గానూ 114 పరుగుల టార్గెట్ ను నిర్ణయించాడు. 17.5 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ కావడంతో 8 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓడిపోయింది.
ఈ మ్యాచ్ ఆరంభం నుంచి అనేక మలుపులు, నాటకాలు కనిపించాయి. పలుమార్లు వర్షం మ్యాచ్ ను అడ్డుకుంది. చిరు జల్లుల పడుతున్న సమయంలోనూ మ్యాచ్ సాగింది. ఎట్టకేలకి ఆఫ్ఘనిస్తాన్ గెలిచి సెమీస్ చేరుకుంది. కేప్టెన్ రషీద్ ఖాన్, నవీనుల్ హక్ నాలుగు చొప్పున వికెట్లు కూల్చారు. గులబ్బదీన్ నబీ, ఫజల్ హక్ ఫారూఖీ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో గ్రూప్ ఏ నుంచి సెమీ ఫైనల్స్ చేరిన రెండో జట్టయింది ఆఫ్ఘనిస్తాన్. టీమిండియా ఇప్పటికే సెమీ ఫైనల్స్ చేరిన విషయం తెలిసిందే. ఆఫ్ఘాన్ గెలుపును ఆ దేశ ప్రజలు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆకలి, పేదరికం, అణచివేత, నిరసనలతో సతమతం అవుతున్న వారు ఆ బాధ, వేదనను మర్చిపోయి క్రికెట్ టీమ్ గెలుపును ఆస్వాదిస్తున్నారు.
ఇదే తరుణంలో అక్కడి తాలిబన్ సర్కారు నుంచి భారత క్రికెట్ బోర్డుకు ఓ స్పెషల్ మెసేజ్ అందింది. క్రికెట్లో ఆఫ్ఘాన్ జట్టు ఎదుగుదల కోసం చేసిన కృషికి, అందిస్తున్న సాయానికి గానూ బీసీసీఐకి థ్యాంక్స్ చెప్పింది . భారత్‌కి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. ఆఫ్ఘానిస్థాన్ టీమ్ ఎదుగుదల కోసం వాళ్లు అందించిన సహాయ సహకారాలు అపూర్వం. భారత బోర్డు చేసిన పనిని మెచ్చుకోకుండా ఉండలేం అంటూ తాలిబన్ గవర్న్‌మెంట్ పొలిటికల్ హెడ్ ఓ ప్రకటనలో తెలియజేసింది. అయితే బీసీసీఐ.. వాళ్లు అడిగిన వెంటనే అవసరమైన వేదికలు ఇవ్వడం, సిరీస్‌ల నిర్వహణ.. ఇలా ఎన్నో విధాలుగా రషీద్ సేనకు చాలా అండగా నిలిచింది. ఈక్రమంలోనే వారు సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆఫ్ఘాన్‌కు మన బోర్డు నుంచి ఇక మీదట కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నారు.
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
This website uses cookies.