Blue Tea : గ్రీన్ టీ లాగానే బ్లూ టీ కూడా సూపర్ బెనిఫిట్స్ అట.. అమృతం లాంటి టీ అస్సలు మిస్ అవ్వకండి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Blue Tea : గ్రీన్ టీ లాగానే బ్లూ టీ కూడా సూపర్ బెనిఫిట్స్ అట.. అమృతం లాంటి టీ అస్సలు మిస్ అవ్వకండి…?

 Authored By ramu | The Telugu News | Updated on :22 July 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Blue Tea : గ్రీన్ టీ లాగానే బ్లూ టీ కూడా సూపర్ బెనిఫిట్స్ అట.. అమృతం లాంటి టీ అస్సలు మిస్ అవ్వకండి...?

Blue Tea : ప్రకృతి ఇచ్చే మొక్కల్లో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. కొన్ని పండ్లు,ఆకులు ఆయుర్వేద మూలికల్లో ఉపయోగిస్తే,పుష్పాలను కూడా ఆయుర్వేద ఔషధాలలో వినియోగిస్తుంటారు. ఇలాంటి పుష్పాలే శంఖ పుష్పాలు. ఇక పుష్పాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆకులతో తయారుచేసిన గ్రీన్ టీ ని ఎలా అయితే తీసుకుంటామో, అలాగే పుష్పాలతో తయారు చేసిన ఈ శంఖపువ్వు టీ ని కూడా తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు నిపుణులు.దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…

Blue Tea గ్రీన్ టీ లాగానే బ్లూ టీ కూడా సూపర్ బెనిఫిట్స్ అట అమృతం లాంటి టీ అస్సలు మిస్ అవ్వకండి

Blue Tea : గ్రీన్ టీ లాగానే బ్లూ టీ కూడా సూపర్ బెనిఫిట్స్ అట.. అమృతం లాంటి టీ అస్సలు మిస్ అవ్వకండి…?

Blue Tea శంకు పువ్వులతో టి

శంకు పుష్పాలతో ప్రధానంగా దేవుల అర్చనలో ఎక్కువగా ఉపయోగిస్తారు.శంకు పుష్పాన్ని అపరాధిత పుష్పం,గిరికర్ణిక, దింటేనా అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఈ పుష్పాన్ని పూజలో ఎంత పవిత్రంగా భావిస్తారో,ఆయుర్వేదంలో కూడా అంతే ప్రత్యేకత కలిగి ఉంది. ఆయుర్వేద వైద్యంలో ఎన్నో అనారోగ్యాలకు ఔషధం లాగా శంకు పుష్పాలను వినియోగిస్తున్నారు. వారంలో రెండుసార్లు శంకు పుష్పాల టీ ని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం…

Blue Tea శంకు పుష్పాలతో టీ ని ఎలా తయారు చేయాలి, దీని ప్రయోజనాలు

పుష్పాలతో చక్కటి టీ ను తయారు చేసుకుని తాగవచ్చు. దీనిని ప్రస్తుతం బ్లూటీగా కూడా పిలుస్తుంటారు. ఇది నీలం రంగులో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ టీ శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది అంటున్నారు నిపుణులు. ఉదయాన్నే పరిగడుపున ఒక కప్పు బ్లూ టీ ని తాగితే జీర్ణ క్రియలో టాక్సిన్ లో బయటకి తొలగింపబడతాయి. జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఎసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలు కూడా మటుమాయమవుతాయి. అధిక బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు, ఈ బ్లూ టీ చక్కని ఎంపిక. శంకు పువ్వుల టీ లో కెసిన్ ఉండదు. అలాగే కార్బోహైడ్రేట్స్, కొవ్వు కొలెస్ట్రాల్ అసలు ఉండవు. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. చిరు తిండ్లు తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు.అంతేకాదు, రోజు శంకు పుష్పాలు టీ తాగితే జీర్ణ క్రియ మెరుపు పడుతుంది. రక్తంలో చక్కర స్థాయిలో ఆకస్మికంగా పెరగకుండా నివారించబడుతుంది. ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా దివ్య ఔషధం. బ్లూ టీలో ఫినోలిక్ యాసిడ్, ఫినానిక్ అమైడ్ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ హై పెర్గ్లై సిమిక్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్రావా న్ని మెరుగుపరుస్తుంది. గ్లూకోస్ జీవక్రియను నియంత్రిస్తుంది. డయాబెటిస్ వ్యాధులకు మంచిది. శంకు పుష్పాలు టీలో బలవర్ధకమైన బయోప్లావనాయిడ్లు సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. యాంటీ హై పెర్లిపిడేమిక్ లక్షణాలు కొలెస్ట్రాల్ వాల్యూమ్లను కొవ్వులను తగ్గిస్తుంది. హైపర్ టెన్షన్ను వంటి అనారోగ్యాల నుంచి రక్షిస్తుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. అలజీమార్స్ తో పోరాడడానికి సహకరిస్తుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది