Skin Benefits : మీ చుట్టుపక్కల ఈ మొక్క ఉంటే అస్సలు వదిలేయకండి.. మీ స్కిన్ కి ఎన్నో బెనిఫిట్స్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Skin Benefits : మీ చుట్టుపక్కల ఈ మొక్క ఉంటే అస్సలు వదిలేయకండి.. మీ స్కిన్ కి ఎన్నో బెనిఫిట్స్…!

Skin Benefits : మన చుట్టుపక్కలలో ఎన్నో మొక్కల్ని చూస్తూ ఉంటాం. కానీ వాటిని అస్సలు పట్టించుకోము. అలాంటి మొక్కలలోని మనకి ఉపయోగపడే ఎన్నో మొక్కలు దాగి ఉంటాయి. మనకి ప్రకృతి చాలా ప్రయోజనాలు ఉన్న మొక్కల్ని ప్రసాదించింది. కాకపోతే వాటిని తెలుసుకోవడం మనకి కొంచెం కష్టం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మొక్కలు ఉంటాయి. అవి మన శరీరానికి కావలసిన ఎన్నో ఉపయోగాలని కలిగించడంలో ప్రకృతి ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. వాటిలలో సింగపూర్ పువ్వులు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :5 November 2022,6:30 am

Skin Benefits : మన చుట్టుపక్కలలో ఎన్నో మొక్కల్ని చూస్తూ ఉంటాం. కానీ వాటిని అస్సలు పట్టించుకోము. అలాంటి మొక్కలలోని మనకి ఉపయోగపడే ఎన్నో మొక్కలు దాగి ఉంటాయి. మనకి ప్రకృతి చాలా ప్రయోజనాలు ఉన్న మొక్కల్ని ప్రసాదించింది. కాకపోతే వాటిని తెలుసుకోవడం మనకి కొంచెం కష్టం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మొక్కలు ఉంటాయి. అవి మన శరీరానికి కావలసిన ఎన్నో ఉపయోగాలని కలిగించడంలో ప్రకృతి ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. వాటిలలో సింగపూర్ పువ్వులు వీటిని శంఖంపూలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పువ్వుల మొక్క యొక్క ఆకులు, పువ్వులు ,కాండం ప్రతి ఒక్కటి కూడా ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఉపయోగాలు కలిగిస్తుంది. ఈ మొక్క ఎన్నో ఆరోగ్య ఉపయోగాలను అనేక రకాల గా సహాయపడుతుంది. ఇప్పుడు ముందుగా ఈ పువ్వులను వినియోగించి మొహం గ్లోగా అవ్వడం కోసం ఓ క్రీమ్ ని తయారు చేయబోతున్నాం..

దానికోసం ఈ పువ్వులను లేదా సింగపూరు పువ్వులను తీసుకొని ఒక గాజు సీసాలో వెయ్యాలి. దీనిలో ఒక గ్లాస్ వేడి నీటిని పోసుకోవాలి. నీళ్లు పోసుకుని మూత పెట్టాలి. కొద్దిసేపటికి పువ్వులు రంగులోకి నీళ్లు కూడా మారిపోతాయి. ఒక గంట తర్వాత పువ్వులు మరియు నీళ్లు మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తని పేస్టులా పట్టుకోవాలి. దీనిని స్రైనర్ తో వాడ పోసుకోవాలి. నీళ్లను తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. దీనిలో ఆ ఫ్లవర్ వాటర్ ని కూడా వేసుకొని బాగా క్రీమ్ లా వచ్చేలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద బౌల్ పెట్టి నీళ్లను వేసి బాగా మరగబెట్టుకోవాలి. ఈ నీటిని ముందుగా కలుపుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని పెట్టి మళ్ళీ మరగ పెట్టుకోవాలి. ఈ మిశ్రమం క్రీం లా అయ్యే వరకు బాగా తిప్పుతూ ఉండాలి. తర్వాత స్టౌ ఆపుకొని ఈ మిశ్రమం చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి.

Many benefits for your skin

Many benefits for your skin

తర్వాత మరొక బౌల్ ని తీసుకొని ఒక స్పూను అలోవెరా జెల్లి కూడా తీసుకోవాలి. దీనికోసం ప్లాంట్ బేస్ అలోవెరా జెల్లీ ఉపయోగించవచ్చు. తర్వాత దీనిలో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ముందుగా తయారుచేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ అలాగే శంఖం పువ్వుల నీళ్లతో చేసుకున్న మిశ్రమంలో మిక్స్ చేసుకోవాలి. ఈ క్రీమ్ హెయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవాలి. ఫ్రిజ్లో రెండు నెలల వరకు ఈ మిశ్రమం నిల్వ ఉంటుంది. ఈ క్రీమ్ ప్రతిరోజు ముఖానికి పెట్టుకుని ఐదు నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసుకున్నట్లయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని వాడడం వలన డార్క్ సర్కిల్స్ ,అలాగే ముడతలు, నల్లటి మచ్చలు సమస్యలు అన్ని తగ్గిపోయి ఫేస్ గ్లో గా మారుతుంది. దీని వలన ఇంకా ఎన్నో రకాల సమస్యలు కూడా తగ్గిపోతాయి.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది