Monkey Pox Virus : కరోనా వైరస్ నుండి ఇప్పుడే కోలుకుంటున్నా మానవాళికి మరొక వైరస్ పంజా విసరడానికి సిద్ధంగా ఉన్నది. అదే మంకీ పాక్స్ వైరస్. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మంకీ పాక్స్ వైరస్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ గా ప్రకటించడం జరిగింది. ఈ వ్యాధి అనేది ప్రపంచానికి ముప్పుగా అభివర్ణించటం గత రెండేళ్లతో పోలిస్తే ఇది రెండవసారి. ఈ వ్యాధి అనేది ఇంతకుముందు దక్షిణాఫ్రికాలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ గా ప్రకటించారు. అయితే బుధవారం WHO సమావేశంలో ఈ ప్రకటన చేశారు. దీని తర్వాత మంకీ పాక్స్ అనే వ్యాధి ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ మంకీ పాక్స్ కేసులు అనేవి ప్రతినిత్యం పెరుగుతున్నాయి అనే ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఏళ్ల క్రితం ఈ కేసులనేవి బాగా పెరిగాయి. ఆ టైంలో ఈ వ్యాధికి సంబంధించిన కేసులు అనేవి అమెరికా నుండి యూరప్ తో పాటు భారతదేశంలో కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో WHO మంకీ పాక్స్ అనే వ్యాధిని ప్రపంచ స్థాయిలో పెద్ద ముప్పుగా అభివర్ణించింది. ప్రస్తుతం ఈ వైరస్ కేసులు అనేవి మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఆఫ్రికాలో మాత్రమే ఈ కేసులు పెరుగుతున్నప్పటికీ ముందు ముందు ఇతర దేశాలలో కూడా మంకీ పాక్స్ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది…
ఈ మంకీ పాక్స్ అనే వ్యాధి కోతుల నుండి మనుషులకు వ్యాపించే వైరస్. ఈ వైరస్ అనేది ఒకరి నుండి మరొకరికి తొందరగా వ్యాపించే అవకాశం కూడా ఉన్నది. అయితే రక్షణ అనేది లేకుండా శారీరక సంబంధం ద్వారా ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన తర్వాత జ్వరం అనేది వస్తుంది. అలాగే శరీరంపై దద్దుర్లు కూడా కనిపిస్తాయి. అలాగే ఇది శరీరమంతా కూడా వ్యాప్తి చెందుతుంది. అంతేకాక ముందుగా దద్దుర్లు అనేవి ముఖంపై వస్తాయి. తర్వాత శరీరం అంతా కూడా వ్యాపిస్తుంది. అయితే స్వలింగ సంపర్క పురుషులలో ఈ వైరస్ కేసులు అధికంగా నమోదు అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ వైరస్ అనేది మొట్టమొదట ఆఫ్రికాలో మొదలైంది…
మళ్లీ ప్రమాదం వస్తుందా : ఈ మంకీ పాక్స్ వైరస్ అనేది మళ్లీ యాక్టివ్ గా మారింది అని ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ జుగల్ కిషోర్ తెలిపారు. ఇలాంటి టైం లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దీని ఇన్ఫెక్టివిటీ రేటు అనేది కోవిడ్ కంటే ఎక్కువగా లేనప్పటికీ కూడా ఆఫ్రికా చుట్టూ ఉన్న దేశాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించింది. ఎందుకు అంటే. ఈ వైరస్ అనేది కొన్ని ఏళ్ల క్రితం కూడా వ్యాప్తి చెందింది. ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ వ్యాపించే అవకాశం ఉన్నది.
ఈ వ్యాధికి నివారణ ఉన్నదా : ఈ వైరస్ సోకిన రోగులు కచ్చితంగా ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాల ఆధారంగా ఆ రోగికి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ వ్యాధికి టీకా మరియు ఔషధం లేకపోయినా రోగికి ఉన్నటువంటి లక్షణాలను తగ్గించడానికి చికిత్స ఇవ్వడం జరుగుతుంది…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.