Monkey Pox Virus : మంకీ పాక్స్ వైరస్ తో మానవాళికి మళ్లీ ప్రమాదమా… దీనికి నివారణ ఏంటి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Monkey Pox Virus : మంకీ పాక్స్ వైరస్ తో మానవాళికి మళ్లీ ప్రమాదమా… దీనికి నివారణ ఏంటి…!

 Authored By ramu | The Telugu News | Updated on :16 August 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Monkey Pox Virus : మంకీ పాక్స్ వైరస్ తో మానవాళికి మళ్లీ ప్రమాదమా... దీనికి నివారణ ఏంటి...!

Monkey Pox Virus : కరోనా వైరస్ నుండి ఇప్పుడే కోలుకుంటున్నా మానవాళికి మరొక వైరస్ పంజా విసరడానికి సిద్ధంగా ఉన్నది. అదే మంకీ పాక్స్ వైరస్. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మంకీ పాక్స్ వైరస్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ గా ప్రకటించడం జరిగింది. ఈ వ్యాధి అనేది ప్రపంచానికి ముప్పుగా అభివర్ణించటం గత రెండేళ్లతో పోలిస్తే ఇది రెండవసారి. ఈ వ్యాధి అనేది ఇంతకుముందు దక్షిణాఫ్రికాలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ గా ప్రకటించారు. అయితే బుధవారం WHO సమావేశంలో ఈ ప్రకటన చేశారు. దీని తర్వాత మంకీ పాక్స్ అనే వ్యాధి ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ మంకీ పాక్స్ కేసులు అనేవి ప్రతినిత్యం పెరుగుతున్నాయి అనే ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఏళ్ల క్రితం ఈ కేసులనేవి బాగా పెరిగాయి. ఆ టైంలో ఈ వ్యాధికి సంబంధించిన కేసులు అనేవి అమెరికా నుండి యూరప్ తో పాటు భారతదేశంలో కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో WHO మంకీ పాక్స్ అనే వ్యాధిని ప్రపంచ స్థాయిలో పెద్ద ముప్పుగా అభివర్ణించింది. ప్రస్తుతం ఈ వైరస్ కేసులు అనేవి మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఆఫ్రికాలో మాత్రమే ఈ కేసులు పెరుగుతున్నప్పటికీ ముందు ముందు ఇతర దేశాలలో కూడా మంకీ పాక్స్ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది…

Monkey Pox Virus మంకీ పాక్స్ అంటే ఏమిటి

ఈ మంకీ పాక్స్ అనే వ్యాధి కోతుల నుండి మనుషులకు వ్యాపించే వైరస్. ఈ వైరస్ అనేది ఒకరి నుండి మరొకరికి తొందరగా వ్యాపించే అవకాశం కూడా ఉన్నది. అయితే రక్షణ అనేది లేకుండా శారీరక సంబంధం ద్వారా ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన తర్వాత జ్వరం అనేది వస్తుంది. అలాగే శరీరంపై దద్దుర్లు కూడా కనిపిస్తాయి. అలాగే ఇది శరీరమంతా కూడా వ్యాప్తి చెందుతుంది. అంతేకాక ముందుగా దద్దుర్లు అనేవి ముఖంపై వస్తాయి. తర్వాత శరీరం అంతా కూడా వ్యాపిస్తుంది. అయితే స్వలింగ సంపర్క పురుషులలో ఈ వైరస్ కేసులు అధికంగా నమోదు అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ వైరస్ అనేది మొట్టమొదట ఆఫ్రికాలో మొదలైంది…

మళ్లీ ప్రమాదం వస్తుందా : ఈ మంకీ పాక్స్ వైరస్ అనేది మళ్లీ యాక్టివ్ గా మారింది అని ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ జుగల్ కిషోర్ తెలిపారు. ఇలాంటి టైం లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దీని ఇన్ఫెక్టివిటీ రేటు అనేది కోవిడ్ కంటే ఎక్కువగా లేనప్పటికీ కూడా ఆఫ్రికా చుట్టూ ఉన్న దేశాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించింది. ఎందుకు అంటే. ఈ వైరస్ అనేది కొన్ని ఏళ్ల క్రితం కూడా వ్యాప్తి చెందింది. ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ వ్యాపించే అవకాశం ఉన్నది.

Monkey Pox Virus మంకీ పాక్స్ వైరస్ తో మానవాళికి మళ్లీ ప్రమాదమా దీనికి నివారణ ఏంటి

Monkey Pox Virus : మంకీ పాక్స్ వైరస్ తో మానవాళికి మళ్లీ ప్రమాదమా… దీనికి నివారణ ఏంటి…!

ఈ వ్యాధికి నివారణ ఉన్నదా : ఈ వైరస్ సోకిన రోగులు కచ్చితంగా ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాల ఆధారంగా ఆ రోగికి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ వ్యాధికి టీకా మరియు ఔషధం లేకపోయినా రోగికి ఉన్నటువంటి లక్షణాలను తగ్గించడానికి చికిత్స ఇవ్వడం జరుగుతుంది…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది