Over Weight : పడుకునే ముందు ఈ డ్రింక్ తాగితే చాలు… కొవ్వు ఐస్ లా కరిగిపోతుంది…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Over Weight : పడుకునే ముందు ఈ డ్రింక్ తాగితే చాలు… కొవ్వు ఐస్ లా కరిగిపోతుంది…!!

Over Weight : ప్రస్తుత కాలంలో ఎంతో మంది స్థూలకాయ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే అధిక బరువును తగ్గించుకొనేందుకు జిమ్ లో గంటల తరబడి చమటోర్చటం మరియు డైటింగ్ మరియు ఆహారంలో మార్పులు లాంటివి చేస్తూ ఉన్నారు. ఇంకా బరువు తగ్గించే ఖరీదైనటువంటి శాస్త్ర చికిత్సలు కూడా చేయించుకుంటూ ఉంటారు. అయితే అధిక బరువు విషయంలో అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. దీనికి కొన్ని చిట్కాలు పాటిస్తే […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 August 2024,8:00 am

Over Weight : ప్రస్తుత కాలంలో ఎంతో మంది స్థూలకాయ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే అధిక బరువును తగ్గించుకొనేందుకు జిమ్ లో గంటల తరబడి చమటోర్చటం మరియు డైటింగ్ మరియు ఆహారంలో మార్పులు లాంటివి చేస్తూ ఉన్నారు. ఇంకా బరువు తగ్గించే ఖరీదైనటువంటి శాస్త్ర చికిత్సలు కూడా చేయించుకుంటూ ఉంటారు. అయితే అధిక బరువు విషయంలో అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. దీనికి కొన్ని చిట్కాలు పాటిస్తే బరువు ను ఈజీగా తగ్గించుకోవచ్చు అని అంటున్నారు నిపుణులు. అయితే మీరు బరువు తగ్గడానికి ఉదయం డ్రింక్ ఒకటి సరిపోదు. మీరు గనక తక్కువ టైంలో బరువు తగ్గాలి అని అనుకుంటే రాత్రి పడుకునే ముందు కొన్ని పానీయాలను తీసుకున్నట్లయితే చాలా మంచిది అని వేగంగా బరువు తగ్గుతారు అని నిపుణులు అంటున్నారు. అయితే రాత్రి నిద్ర కు ముందు తాగాల్సిన పానీయాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

రాత్రి పడుకునే ముందు తీసుకోవలసిన పానీయాలు : గ్రీన్ టీ : గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు కాటెచిన్స్ అనేవి సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీవ క్రియను ఎంతగానో పెంచడానికి సహాయపడతాయి. ఇంకా కొవ్వూను కరిగించే ప్రక్రియను కూడా ఎంతో వేగవంతం చేస్తాయి. అంతేకాక రాత్రి పూట గ్రీన్ టీ తీసుకోవడం వలన శరీరంలో కొవ్వు అనేది తగ్గుతుంది. అలాగే నిద్ర కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఈ పానీయం రాత్రిపూట శక్తిని తగ్గించటంలో కూడా మేలు చేస్తుంది. ఇకపోతే అకాల ఆకలిని కూడా నియంత్రిస్తుంది… వాము నీరు : వాము నీరు కూడా బరువు తగ్గటానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మీ వాము నీటిని తయారు చేసుకోవడానికి నీటిలో వామును కొన్ని గంటల పాటు నానబెట్టి ఫిల్టర్ చేయాలి. మీకు వీలైతే కొంచెం వేడి చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఈ వాము నీరు అనేది పొట్ట సమస్యల నుండి ఉపశమనం కలిగించడంతో పాటుగా జీవక్రియను కూడా పెంచుతుంది. అలాగే రాత్రిపూట జర్ణ క్రియ ప్రక్రియను కూడా ఎంతో మెరుగుపరిచి బరువును తగ్గించేందుకు సహాయపడుతుంది…

వేడి నిమ్మ నీరు : నిమ్మకాయ రసాన్ని వేడి నీళ్లల్లో కలుపుకొని తీసుకోవటం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ఇవి బరువును తగ్గించటంలో కూడా ఎంతో బాగా పనిచేస్తాయి. అలాగే లెమన్ వాటర్ లో విటమిన్ సి అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరం నుండి విషపూరిత పదార్థాలను బయటకు పంపించడంలో కూడా మేలు చేస్తుంది. ఇకపోతే బరువును తగ్గించే ప్రక్రియను కూడా ఎంతో వేగవంతం చేయడంలో సహాయపడుతుంది… సెలెరీ జ్యూస్ : సెలెరీ చూసేందుకు కోతిమీర లా ఉంటుంది. కానీ దీనిలో ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి. ఇది రాత్రిపూట తాగడానికి సులభమైన మరియు ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది అని చెప్పొచ్చు. ఈ సెలేరీలో చాలా తక్కువ క్యాలరీలు మరియు అధిక నీటి కంటెంట్ ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. అలాగే రాత్రిపూట అనవసరమైన ఆకలిని కూడా నియంత్రిస్తుంది. ఇది మాత్రమే కాక నిర్విషీకరణలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంకా బరువు తగ్గేందుకు కూడా బాగా హెల్ప్ చేస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది