Pistachio : మన రోజువారి జీవితంలో ఆరోగ్య కోసం ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటూ ఉంటాము. ఈ డ్రై ఫుడ్స్ లో పిస్తా కూడా ఒకటి. ఈ పిస్తాలో ఎక్కువ మొత్తంలో ఫైబర్, ప్రోటీన్ ఉండడం వలన ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది.దీంతో మీరు ఆహారాన్ని అధికంగా తీసుకోరు. దీనివల్ల బరువు తొందరగా తగ్గుతారు. ఈ పిస్తా పప్పులను చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవటం వలన జీర్ణ వ్యవస్థ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అయితే గుండె సమస్యలు ఉన్నవారు ఈ పిస్తా పప్పును కచ్చితంగా తీసుకోవాలి. అలాగే డయాబెటిక్ పేషంట్లు రోజు కొన్ని పిస్తా పప్పులు తీసుకోవడం వలన శరీరంలో గ్లైసోమిక్ స్థాయిలు అనేవి తగ్గుతాయి. అలాగే రక్త ప్రసరణలో కూడా ఎంతో మేలు చేస్తుంది…
ఈ పిస్తా పప్పులో పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ b6, కాపర్, థయామిన్, పిండి పదార్థాలు, ఫైబర్, భాస్వరం, మాంగనీస్, ప్రోటీన్,కొవ్వులు లాటి ఎన్నో పోషకాలు అధికంగా ఉన్నాయి. శరీరంలో ప్రోటీన్ లోపం ఉన్నటువంటి వారు కచ్చితంగా పిస్తా పప్పును తీసుకోవాలి అని నిపుణులు అంటున్నారు. ఇది ప్రోటీన్ లోపాన్ని నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ పిస్తా పప్పును తీసుకోవడం వల్ల ముఖం పై ఉన్న ముడతలు కూడా తగ్గుతాయి. ఇవి చర్మాని ఎంతో బిగుతుగా ఉంచుతుంది. అయితే దెబ్బతిన్నటువంటి చర్మ కణాలను కూడా రిపేర్ చేయడంలో ఎంతో మేలు చేస్తుంది.
ఈ ప్రస్తా పప్పు తీసుకోవటం వలన కంటి చూపు కూడా ఎంతో మెరుగుపడుతుంది అని పరిశోధనలో తేలింది. అయితే కంటి సమస్యలు ఉన్నవారు కచ్చితంగా తమ ఆహారంలో పిస్తా పప్పును తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే క్యాన్సర్ కారక వైరస్ లను తగ్గించడంలో పిస్తాలో ఉండే పోషకాలు ఎంతో బాగా పనిచేస్తాయి. అలాగే శరీరంలో విడుదలయ్యే వ్యర్ధాలను కూడా ఈ పిస్తా పప్పు దూరం చేయగలదు. ఈ పిస్తా పప్పులో ఐరన్, మెగ్నీషియం అధికంగా ఉండడం వలన శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణాన్ని పెంచుకోవచ్చు. ఈ పిస్తా పప్పులు రోజు కొన్ని తీసుకోవటం వలన శరీరంలో కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రించవచ్చు. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదాలు కూడా తగ్గుతాయి. ఈ పిస్తాలో ఫైబర్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కావున ఇది బరువును నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది.ఈ పిస్తా పప్పులు తీసుకోవడం వలన మెదడు కూడా ఎంతో చురుకుగా పనిచేస్తుంది…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.