Pista : రోజుకు కొన్ని పిస్తా పప్పుల ను తీసుకోండి.. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pista : రోజుకు కొన్ని పిస్తా పప్పుల ను తీసుకోండి.. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :13 July 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Pista : రోజుకు కొన్ని పిస్తా పప్పుల ను తీసుకోండి.. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టండి...!

Pistachio : మన రోజువారి జీవితంలో ఆరోగ్య కోసం ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటూ ఉంటాము. ఈ డ్రై ఫుడ్స్ లో పిస్తా కూడా ఒకటి. ఈ పిస్తాలో ఎక్కువ మొత్తంలో ఫైబర్, ప్రోటీన్ ఉండడం వలన ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది.దీంతో మీరు ఆహారాన్ని అధికంగా తీసుకోరు. దీనివల్ల బరువు తొందరగా తగ్గుతారు. ఈ పిస్తా పప్పులను చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవటం వలన జీర్ణ వ్యవస్థ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అయితే గుండె సమస్యలు ఉన్నవారు ఈ పిస్తా పప్పును కచ్చితంగా తీసుకోవాలి. అలాగే డయాబెటిక్ పేషంట్లు రోజు కొన్ని పిస్తా పప్పులు తీసుకోవడం వలన శరీరంలో గ్లైసోమిక్ స్థాయిలు అనేవి తగ్గుతాయి. అలాగే రక్త ప్రసరణలో కూడా ఎంతో మేలు చేస్తుంది…

ఈ పిస్తా పప్పులో పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ b6, కాపర్, థయామిన్, పిండి పదార్థాలు, ఫైబర్, భాస్వరం, మాంగనీస్, ప్రోటీన్,కొవ్వులు లాటి ఎన్నో పోషకాలు అధికంగా ఉన్నాయి. శరీరంలో ప్రోటీన్ లోపం ఉన్నటువంటి వారు కచ్చితంగా పిస్తా పప్పును తీసుకోవాలి అని నిపుణులు అంటున్నారు. ఇది ప్రోటీన్ లోపాన్ని నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ పిస్తా పప్పును తీసుకోవడం వల్ల ముఖం పై ఉన్న ముడతలు కూడా తగ్గుతాయి. ఇవి చర్మాని ఎంతో బిగుతుగా ఉంచుతుంది. అయితే దెబ్బతిన్నటువంటి చర్మ కణాలను కూడా రిపేర్ చేయడంలో ఎంతో మేలు చేస్తుంది.

Pista రోజుకు కొన్ని పిస్తా పప్పుల ను తీసుకోండి ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టండి

Pista : రోజుకు కొన్ని పిస్తా పప్పుల ను తీసుకోండి.. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టండి…!

ఈ ప్రస్తా పప్పు తీసుకోవటం వలన కంటి చూపు కూడా ఎంతో మెరుగుపడుతుంది అని పరిశోధనలో తేలింది. అయితే కంటి సమస్యలు ఉన్నవారు కచ్చితంగా తమ ఆహారంలో పిస్తా పప్పును తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే క్యాన్సర్ కారక వైరస్ లను తగ్గించడంలో పిస్తాలో ఉండే పోషకాలు ఎంతో బాగా పనిచేస్తాయి. అలాగే శరీరంలో విడుదలయ్యే వ్యర్ధాలను కూడా ఈ పిస్తా పప్పు దూరం చేయగలదు. ఈ పిస్తా పప్పులో ఐరన్, మెగ్నీషియం అధికంగా ఉండడం వలన శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణాన్ని పెంచుకోవచ్చు. ఈ పిస్తా పప్పులు రోజు కొన్ని తీసుకోవటం వలన శరీరంలో కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రించవచ్చు. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదాలు కూడా తగ్గుతాయి. ఈ పిస్తాలో ఫైబర్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కావున ఇది బరువును నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది.ఈ పిస్తా పప్పులు తీసుకోవడం వలన మెదడు కూడా ఎంతో చురుకుగా పనిచేస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది