Ragi Hava Benifits : రాగి జావతో బోలెడు ప్రయోజనాలు.. సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ragi Hava Benifits : రాగి జావతో బోలెడు ప్రయోజనాలు.. సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం..!

 Authored By mallesh | The Telugu News | Updated on :23 January 2022,7:00 am

Ragi Hava Benifits : రాగులతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలా కాలం నుంచి దేశంలో అత్యధికంగా వినియోగంలో ఉన్న తృణధాన్యాల ఆహారంలో రాగులు ఒకటి. వీటిలో కాల్షియం, పొటాషియం, కార్పోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్నాయి. దీంతోపాటు బి విటమిన్లు, ఐరన్ లాంటివి సమృద్ధిగా ఉన్నాయి. రాగులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని వైద్య నిపుణులు తెలిపారు. రాగులను ఎలా తీసుకున్నా పలు రోగాలకు చెక్ పెట్టవచ్చని వెల్లడించారు. ప్రతి రోజూ రాగి జావ తాగితే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయాన్ని రాగి జావ తాగితే చాలా మంచిది. రోగాలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాగులను ఉప్మా లాగా చేసుకోని తిన్నా.. శరీరానికి అధిక బలం వస్తుంది. మొలకెత్తిన రాగులు తిన్నా చాలా బెటర్. ఇందులో అనేక పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా శరీరానికి చేకూర్చే బలమైన పోషకాలన్నీ రాగులల్లో లభిస్తాయి. రాగుల్లో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉన్నాయి. కావున రాగులు మధుమేహ రోగులకు మంచి ఆహారం. రాగులలో రక్తంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెను రక్షిస్తాయని పేర్కొంటున్నారు. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.రాగుల్లో ఎక్కువగా పీచు పదార్ధాలు ఉన్నాయి. కావున వీటివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాక, పేగులలో పుండ్లు, అతిసార, పెద్ద పేగు కాన్సర్‌ నుంచి రక్షణ లభిస్తుంది.

Ragi Hava lots of benefits with copper barley

Ragi Hava lots of benefits with copper barley

 బరువును కూడా తగ్గిస్తాయి. రాగులు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి అంటు వ్యాధుల బారి నుంచి రక్షిస్తాయి. రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి. నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతాయి. ఎముకలు ధృఢంగా ఉంచడమే కాకుండా కండరాలకు బలం చేకూరుతుంది. కావున ఉదయాన్నే రాగి జావ తాగితే.. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చంటున్నారు నిపుణులు. తయారీ విధానం.. వేడి నీటిలో తగినంత రాగి పిండి కలిపాలి. ఆ తర్వాత జావలా చేసుకోవాలి. దీని రుచి కోసం కొంచెం మజ్జిగ, బెల్లం లాంటివి కలుపుకోని తాగవచ్చు. అయితే ఉదయాన్నే తాగితే చాలా మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది