Chandrababu : ఎమ్మెల్యేలను వణికిస్తున్న చంద్రబాబు సర్వే..!
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల నుంచి తమ ప్రతినిధులపై ఎలా స్పందన ఉందో తెలుసుకునే క్రమంలో పార్టీ అధిష్టానం ఐవీఆర్‌ఎస్ (IVRS) కాల్స్ ద్వారా సమీక్ష ప్రారంభించింది. ముందుగా రాయలసీమ ప్రాంతంలోని ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని వారి పనితీరు పట్ల ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
Chandrababu : ఎమ్మెల్యేల పనితీరు బాగుందా..? లేదా..? బాబు ఇలా తెలుసుకుంటున్నాడా..?
“మీ ఎమ్మెల్యే పనితీరు బాగుందా ..లేదా ?” అనే ప్రశ్నలతో ప్రజలతో కాల్స్ ద్వారా పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను నమోదు చేస్తూ, ప్రతి ఎమ్మెల్యే పట్ల వారి సంతృప్తి లేదా అసంతృప్తిని అధ్యయనం చేస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండే నేతల్ని గుర్తించి, జనం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న నేతలపై చర్యలు తీసుకునే అవకాశముంది.
ఇటీవల (KK) సర్వే ఫలితాల్లో 33 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో ఆగ్రహం ఉందని వెల్లడైన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పార్టీకి బలహీనంగా మారుతున్న ప్రాంతాల్లో ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తూ, తగిన మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు తొలి అడుగుగా IVRS కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుండటం విశేషం. దీనిని బట్టి త్వరలోనే టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై కీలక నిర్ణయాలు వెలువడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.