Dark Circles : కళ్ళ కింద మచ్చలు శాశ్వతంగా మాయం…!!
Dark Circles : మనం ఆరోగ్యంగా ఉన్నామా.. లేదా.. అనేది మన కళ్ళు చెప్పేస్తాయి. మనం ఒత్తిడికి గురైన డిప్రెషన్ తో బాధపడుతున్న.. నిద్రలేమి సమస్యగాని రక్తహీనత మరి ఇతర అనారోగ్య సమస్యలైనా కళ్ళు ఇట్టే చెబుతాయి. మరికొందరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా కేవలం కంటికి విశ్రాంతి లేని కారణంగా సరైన నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు కూడా కంటికిందా సర్కిల్స్ వస్తాయి. వాటికి కూడా ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల ఆయింట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఏదేమైనా ఎటువంటివి సహజ సిద్ధంగా ఇంట్లో ఉండే నేచురల్ ఇంగ్రిడియంట్స్ తో తగ్గించుకుంటే ముఖంపై ఎటువంటి మచ్చలు ఉండవు.. కళ్ళు కూడా ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటాయి.
చక్కని హోం రెమిడీ తెలుసుకోబోతున్నాం . కంటికింద నల్లటి వలయాలను ప్రారంభంలోనే వీటిని గుర్తించి తగ్గించే దశగా చర్యలు తీసుకోవాలి. లేదంటే కళ్ళ కింద నల్లటి మచ్చలు అలాగే ఉండిపోవడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడ వస్తాయి. ఈ ఎండాకాలం మీ చర్మం మారినట్లు కనిపిస్తే దానికి ఈ విధంగా చేయండి బంగాళదుంపని ఉపయోగించడం ద్వారా మళ్ళి చక్కగా మీరు స్క్రీన్ ని మెరుగుపరచుకోవచ్చు. బంగాళాదుంపలో విటమిన్ సి, విటమిన్ బిసి, విటమిన్ బి వన్, బి త్రీ ఫాస్ఫరస్, పొటాషియం, వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చర్మ కణాలను రిపేర్ చేయడానికి పనిచేస్తాయి. బంగాళదుంప చర్మానికి చాలా మంచిదని అందరూ అంటుంటారు.
ఇది కళ్ళ కింద నల్లటి వలయాలను తొలగిస్తుంది. చర్మంపై మచ్చ లేకుండా క్లీన్ చేస్తుంది. ఇది కాలిపోయిన చర్మ సమస్యలను కూడా తొలగిస్తుంది. అయితే వీటిని ఎలా ఉపయోగించాలి ఇప్పుడు చూద్దాం. బంగాళదుంపలను కడిగి పై తొక్కు తీసి తురుముకోండి దానికి రెండు చుక్కల గ్లిజరిన్, రెండు చుక్కల రోజు వాటర్, అర టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ బియ్యప్పిండి కలపండి. దీన్ని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసేయండి. ఆరిన తర్వాత ముఖం చల్లని నీళ్లతో కడుక్కోండి ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే చర్మం చాలా కాంతివంతంగా ఉంటుంది. కళ్ళకి బంగాళదుంప రసం రాస్తే కొన్ని రోజులకి నల్లటి వలయాలు తగ్గిపోతాయి. కావాలంటే బంగాళదుంప ముక్కలను కూడా కళ్ళపై పెట్టుకోవచ్చు.