Breakfast : ఉదయం అల్పాహారం తీసుకోకపోతే…. ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం పడుతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Breakfast : ఉదయం అల్పాహారం తీసుకోకపోతే…. ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం పడుతుంది…!

Breakfast : మన రోజు మొదలు బాగుంటే మన రోజంతా కూడా ఎంతో మంచిగా సాగుతుంది అని అంటారు. కానీ ప్రస్తుతం మన జీవన శైలిలో అతి ముఖ్యమైనది అల్పాహారం. అయితే ఎంతోమంది ఉన్నట్టుండి అల్పాహారాన్ని మానేస్తూ ఉంటారు. అయితే ఈ అలవాటు ఎంతో కాలంగా కొనసాగడం వలన శరీరంలో పోషకల లోపం అనేది ఏర్పడుతుంది. అలాగే క్రమంగా మన శరీరం వ్యాధులకు నిలయంగా మారుతుంది అని అంటున్నారు నిపుణులు. అలాగే నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే, ఉదయం […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 October 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Breakfast : ఉదయం అల్పాహారం తీసుకోకపోతే.... ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం పడుతుంది...!

Breakfast : మన రోజు మొదలు బాగుంటే మన రోజంతా కూడా ఎంతో మంచిగా సాగుతుంది అని అంటారు. కానీ ప్రస్తుతం మన జీవన శైలిలో అతి ముఖ్యమైనది అల్పాహారం. అయితే ఎంతోమంది ఉన్నట్టుండి అల్పాహారాన్ని మానేస్తూ ఉంటారు. అయితే ఈ అలవాటు ఎంతో కాలంగా కొనసాగడం వలన శరీరంలో పోషకల లోపం అనేది ఏర్పడుతుంది. అలాగే క్రమంగా మన శరీరం వ్యాధులకు నిలయంగా మారుతుంది అని అంటున్నారు నిపుణులు. అలాగే నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే, ఉదయం అల్పాహారం తినడం వల్ల మీ శరీరానికి గ్లూకోజ్ అనేది బాగా అంచుతుంది. అలాగే ఇది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని కూడా ప్రోత్సహిస్తుంది. అదే టైమ్ లో అల్పాహారాన్ని అధిక రోజులు మానేయడం వలన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలనేవి కూడా తగ్గుతాయి. దీని కారణం చేత టైప్ టు మధుమేహం వచ్చే ప్రమాదాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. అయితే ఒక నెలపాటు నిరంతరంగా ఉదయాన్నే అల్పాహారాన్ని తినడం మానేస్తే మన ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Breakfast చిరాకు

నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే న్యూరో ట్రాన్స్మిటర్ సెరటోనిన్ మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఇది మన తీసుకొని అల్పాహారం వలన ప్రభావితం అవుతుంది. మనం ఒక నెల రోజులపాటు అల్పాహారాన్ని నిరంతరంగా తినడం మానేస్తే సెరటోనిన్ స్థాయిలు అనేవి బాగా దెబ్బతింటాయి. దీని కారణం చేత చిరాకు మరియు ఆందోళన, నిరాశ లాంటి లక్షణాలు కూడా బాగా పెరిగిపోతాయి…

బరువు పెరుగుట : ఉదయం అల్పాహారం మానేయడం వలన బరువు తగ్గటం కంటే ఎక్కువగా అనారోగ్యకరమైన సమస్యలు వస్తాయి. అలాగే అల్పాహారం లేనప్పుడు తరచుగా మధ్యాహ్నం భోజనా న్ని అధికంగా తింటాము. ఇది బరువు పెరిగేందుకు కూడా కారణం కావచ్చు…

మెటబాలిక్ సిండ్రోమ్ : ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం వలన మేటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాలను పెంచుతుంది. అలాగే ఇది గుండె జబ్బులు మరియు స్ట్రోక్, టైప్ టు డయాబెటిస్ ప్రమాదాలను కూడా పెంచగలదు…

గుండె జబ్బులు వచ్చే ప్రమాదం : ఉదయం అల్పాహారం తీసుకొని వారికి గుండెపోటు మరియు రక్త పోటు అలాగే మధుమేహం వచ్చే ప్రమాదాలు కూడా అధికంగా ఉంటాయి. అందుకే మీరు మీ గుండె ఆరోగ్యాంగా ఉండేందుకు అల్పాహారం తీసుకోవటం మర్చిపోకండి…

టైప్ టు డయాబెటిస్ : ఉదయం అల్పాహారం మానేయటం వలన టైప్ టు డయాబెటిస్ రిస్క్ అనేది బాగా పెరిగిపోతుంది. అలాగే ఉదయం అల్పాహారం మానేయడం వలన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉండవు. అంతేకాక ఇది డయాబెటిస్ ప్రమాదాలకు కూడా ఎంతగానో దారితీస్తుంది…

Breakfast ఉదయం అల్పాహారం తీసుకోకపోతే ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం పడుతుంది

Breakfast : ఉదయం అల్పాహారం తీసుకోకపోతే…. ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం పడుతుంది…!

పోషకాల కొరత : ఉదయం అల్పాహారం శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలను ఇస్తుంది. అలాగే ఉదయం అల్పాహారం తీసుకోకపోతే మన శరీరంలో విటమిన్లు మరియు మినరల్స్,ఫైబర్ లాంటి ఎంతో అవసరమైన పోషకాలు లభించవు. ఇది ఎన్నో రకాల వ్యాధులకు కూడా కారణం అవుతుంది…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది