Vitamin B12 Overdose : ఆరోగ్యంగా ఉండటానికి.. శరీర పరిపుష్టి కలిగి ఉండటానికి పోషకాలు విటమిన్స్ తగు మోతాదులో తీసుకోవాలి. ఆహారం ద్వారా కానీ సప్లిమెంట్స్ ద్వారా కానీ చాలామంది తీసుకుంటారు. అయితే ఒక్కోసారి అతిగా తీసుకోవడం వల్ల కూడా శరీరానికి హాని చేస్తాయి. అందుకే ఎదైనా తగు మోతాదులో తీసుకుంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామందిలో బీ 12 విటమిన్ లోపం ఉంటుంది. మాంసం, సీ ఫుడ్, సప్లిమెంట్స్ అధికంగా తీసుకుంటారు. దీంతో శరీరంలో బీ 12 అధికమై పలు సమస్యలకు దారితీస్తుంది. అయితే విటమిన్ బీ 12 మాంసాహార పదార్థాలలో మాత్రమే లభిస్తుంది.
అందుకే చాలా మంది శాకాహారులు బీ 12 మాత్రాలను లేదా సప్లిమెంట్లను వాడుతుంటారు. ఆహారం ద్వారా తగినంత బి12 అందని వారు కూడా సప్లిమెంట్లపై ఆధారపడతారు. ఎందుకంటే శరీరం సహజంగా దీనిని ఉత్పత్తి చేయదు. బీ 12 ఎందుకు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎర్ర రక్తకణాల పుట్టుకకు, నాడుల మధ్య సమాచారం చేరవేసేందుకు, జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో విటమిన్ బీ 12 ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే, సప్లిమెంట్లకు బదులుగా విటమిన్ బీ 12ని ఆహారం నుంచే తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మాంసం, పాల పదర్థాలు, తృణధాన్యాలను తినని వారు మాత్రమే సప్లిమెంట్లు తీసుకుంటుంటారు. విటమిన్ బీ 12 ఉదయం తీసుకుంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే బీ 12 ని ఆహార రూపంలో తీసుకుంటే అంతగా ఎఫెక్ట్ చూపదు కానీ..
కృత్రిమంగా ఇంజక్షన్ల రూపంలో తీసుకుంటే మాత్రంలో శరీరంలో ఈ విటమిన్ స్ఠాయిలు పెరిగే అవకాశం ఉంది. కండరాల్లో ఈ ఇంజక్షన్లు చేస్తారు కాబట్టి హైడ్రాక్సోకోబాలమిన్ లేదా సైనోకోబాలమిన్ త్వరగా శరీరంలో కలిసేలా చేస్తాయి. దీంతో ప్రభావం వెంటనే చూపిస్తాయి. దీంతో ఇతర సమస్యలు బాధిస్తాయి. తలనొప్పి, మైకం, డయేరియా, చర్మంపై దద్దుర్లు, దురద, వికారం, వాంతులు, అలసట, వాపు, జలదరింపు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇది మరింత ఎక్కువైతే అనాఫిలాక్సిస్ అనే అలర్జిక్ రియాక్షన్ వస్తుంది. దీనివల్ల ముఖం, నాలుక, గొంతు వాపు సమస్యలు బాధిస్తాయి. అందుకే తగిన మోతాదులో ఈ విటమిన్ తీసుకుంటే మంచిది.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.