Vitamin B12 Overdose : విట‌మిన్ బీ 12 మోతాదుకు మించితే డేంజ‌ర్.. వీటితో మ‌రింత స‌మ‌స్య‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vitamin B12 Overdose : విట‌మిన్ బీ 12 మోతాదుకు మించితే డేంజ‌ర్.. వీటితో మ‌రింత స‌మ‌స్య‌

 Authored By mallesh | The Telugu News | Updated on :20 June 2022,5:00 pm

Vitamin B12 Overdose : ఆరోగ్యంగా ఉండ‌టానికి.. శ‌రీర ప‌రిపుష్టి క‌లిగి ఉండ‌టానికి పోష‌కాలు విట‌మిన్స్ త‌గు మోతాదులో తీసుకోవాలి. ఆహారం ద్వారా కానీ స‌ప్లిమెంట్స్ ద్వారా కానీ చాలామంది తీసుకుంటారు. అయితే ఒక్కోసారి అతిగా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా శ‌రీరానికి హాని చేస్తాయి. అందుకే ఎదైనా త‌గు మోతాదులో తీసుకుంటేనే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామందిలో బీ 12 విట‌మిన్ లోపం ఉంటుంది. మాంసం, సీ ఫుడ్, స‌ప్లిమెంట్స్ అధికంగా తీసుకుంటారు. దీంతో శ‌రీరంలో బీ 12 అధిక‌మై ప‌లు స‌మ‌స్య‌లకు దారితీస్తుంది. అయితే విటమిన్ బీ 12 మాంసాహార ప‌దార్థాల‌లో మాత్రమే లభిస్తుంది.

అందుకే చాలా మంది శాకాహారులు బీ 12 మాత్రాలను లేదా సప్లిమెంట్లను వాడుతుంటారు. ఆహారం ద్వారా తగినంత బి12 అందని వారు కూడా సప్లిమెంట్లపై ఆధారపడతారు. ఎందుకంటే శరీరం సహజంగా దీనిని ఉత్పత్తి చేయదు. బీ 12 ఎందుకు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎర్ర రక్తకణాల పుట్టుకకు, నాడుల మ‌ధ్య సమాచారం చేరవేసేందుకు, జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో విటమిన్ బీ 12 ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే, సప్లిమెంట్లకు బదులుగా విటమిన్ బీ 12ని ఆహారం నుంచే తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మాంసం, పాల ప‌ద‌ర్థాలు, తృణధాన్యాలను తినని వారు మాత్రమే సప్లిమెంట్లు తీసుకుంటుంటారు. విటమిన్ బీ 12 ఉదయం తీసుకుంటేనే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే బీ 12 ని ఆహార రూపంలో తీసుకుంటే అంత‌గా ఎఫెక్ట్ చూప‌దు కానీ..

side effects of taking too many vitamin b12 supplements

side effects of taking too many vitamin b12 supplements

Vitamin B12 Overdose : ఈ రూపంలో తీసుకుంటే ప్ర‌మాదం..

కృత్రిమంగా ఇంజ‌క్ష‌న్ల రూపంలో తీసుకుంటే మాత్రంలో శ‌రీరంలో ఈ విట‌మిన్ స్ఠాయిలు పెరిగే అవ‌కాశం ఉంది. కండరాల్లో ఈ ఇంజక్షన్లు చేస్తారు కాబ‌ట్టి హైడ్రాక్సోకోబాలమిన్ లేదా సైనోకోబాలమిన్ త్వరగా శరీరంలో కలిసేలా చేస్తాయి. దీంతో ప్ర‌భావం వెంట‌నే చూపిస్తాయి. దీంతో ఇతర స‌మ‌స్య‌లు బాధిస్తాయి. తలనొప్పి, మైకం, డయేరియా, చర్మంపై దద్దుర్లు, దురద, వికారం, వాంతులు, అలసట, వాపు, జలదరింపు వంటి అనారోగ్య‌ స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. ఇది మరింత ఎక్కువైతే అనాఫిలాక్సిస్ అనే అలర్జిక్ రియాక్షన్‌ వస్తుంది. దీనివల్ల ముఖం, నాలుక, గొంతు వాపు సమస్యలు బాధిస్తాయి. అందుకే త‌గిన మోతాదులో ఈ విట‌మిన్ తీసుకుంటే మంచిది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది