Bed : ఇక బెడ్స్ కి గుడ్ బై చెప్పేయండి.. నేలపై పడుకుంటే బోలెడు లాభాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bed : ఇక బెడ్స్ కి గుడ్ బై చెప్పేయండి.. నేలపై పడుకుంటే బోలెడు లాభాలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 March 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Bed : ఇక బెడ్స్ కి గుడ్ బై చెప్పేయండి.. నేలపై పడుకుంటే బోలెడు లాభాలు..!

Bed  : ప్రస్తుతం ప్రజలందరూ కూడా కాలానికి అనుగుణంగా విధానాలను మార్చుకుంటున్నారు. సౌకర్యాల విషయానికొస్తే చాలామంది లగ్జరీ లైఫ్ కోసం వెతుకుతూ ఉన్నారు. అయితే నేలపై పడుకుని పాత సాంప్రదాయం ఈనాటికి సరి అయిందని మరోసారి నిరూపణ జరిగింది. ఈ ఆధునిక యుగంలో అందరూ సుతిమెత్తని బెడ్లను మంచాలను వినియోగిస్తున్నారు. అయితే అటువంటి మంచాన్ని వదిలి నేలపై పడుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక ప్రతిరోజు బెడ్స్ ని పక్కకు పడేసి నేలపై పడుకోవడం అలవాటు చేసుకుంటారు.. అయితే నేలపై పడుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేలపై పడుకోవడం వల్ల కలిగే ఆధ్యాత్మిక లాభాలు; నేలపై పడుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన సహజమైన విశ్రాంతి దొరుకుతుంది. ఇది మన వీపుని నిటారుగా ఉంచుతుంది.

కండరాలను రిలాక్స్ చేస్తుంది. మీరు నేలపై పడుకున్నప్పుడు మీ మనసులోని ఆందోళనలు కూడా తగ్గుతాయి. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ అత్యధిక ఒత్తిడితో కూడిన యుగంలో నేలపై నిద్రపోవడం మనల్ని ప్రకృతికి దగ్గర చేస్తుంది. భూమితో అనుసంధానం చేయడం వలన మనం మరింత సమతుల్యత ప్రశాంతతను పొందుకోవచ్చు.. నేలపై పడుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. అదేవిధంగా నిద్రలో సహజ శరీర కదలిక ఉంటుంది. పరుపులు, దిండ్ల ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. మంచి రక్త ప్రసరణ కలుగుతుంది. వేసవిలో నేలపై పడుకోవడం వల్ల శరీరానికి కాస్త చల్లగా ఉంటుంది. నేల చల్లదనానికి శరీర ఉష్ణోగ్రత నెమ్మదిగా తగ్గుతుంది. దాని వలన మరింత గాఢంగా నిద్రపోతారు. అలాగే చాలామంది ఆఫీస్ నుంచి ఇంటి పనితో అలసిపోతూ ఉంటారు. వారికి బాడీపెయిన్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు.

అటువంటి వారు బెడ్స్ కి గుడ్ బై చెప్పి నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోవాలి. నేల మీద పడుకుంటే ఆ ఫలితం మీరే ఆస్వాదిస్తారు.నేల మీద పడుకోవడం వల్ల మానసిక ప్రశాంతత: మనస్తత్వవేత్తలు నేలపై పడుకోవడం వల్ల శరీరం రిలాక్సినేషన్ నేలతో అనుబంధం ఏర్పడుతుందని చెప్తున్నారు. నేలపై పడుకోవడం వలన శరీర భంగిమ సరియైన రీతిలో ఉంటుంది. అదే పరుపులు పై పడుకున్నప్పుడు మనం నిద్రించే సమయంలో కుంగిపోతూ ఉంటాయి. ఇది అసౌకర్యానికి గురవుతుంది. నేలపై పడుకోవడం వల్ల వెన్నుముక నిటారుగా ఉంటుంది. మనం నేలపై పడుకున్నప్పుడు మన శరీరం పూర్తిగా రిలాక్స్ జరుగుతుంది. మన పూర్తి విశ్రాంతి తీసుకోవచ్చు.. ఇది ఎన్నో నొప్పులని తగ్గిస్తుంది. వెన్నుముకపై ఒత్తిడి తగ్గించేందుకు దిండును వినియోగించవచ్చు. నడుము భాగంలో పల్చని పిల్లోనూ పెట్టుకొని నిద్రించవచ్చు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది