Home » Health » Sleep On The Floor
Health

Sleep On The Floor : నేలపై పడుకుంటే ఎన్ని లాభాలు తెలుసా… ఇక మంచం వద్దని బయట పడేస్తారు…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: April 8, 2025, 11:11 am
Advertisement

Sleep On The Floor : ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా నేలపై పడుకోవడం మానేస్తున్నారు. ఇప్పుడు బెడ్ మంచాలు వంటివి వచ్చాయి. అప్పట్లో నేలపై చాపపరిచి పడుకునేవారు. ఇప్పుడు కూడా కొంతమంది నేలపై పడుకునే అలవాటు ఉంటుంది. మంచం పై కన్నా నేలపై పడుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నేలపై నిద్రపోయేటప్పుడు నిద్రలో మనకు సహజ శరీరక కదలిక ఉంటుంది. తద్వారా రక్తప్రసరణ జరుగుతుంది. వేసవికాలంలో నేలపై పడుకుంటే శరీరం కాస్త చల్లబడుతుంది. నేల చల్లదనానికి శరీర వేడి నెమ్మదిగా తగ్గిపోతుంది. దీనివల్ల మీరు గాఢంగా నిద్రపోవచ్చు. అంతేకాదు శరీరంలో ఎటువంటి నొప్పులు ఉన్నా కూడా లేదా బాధపడుతున్న కూడా వాటికి నేను భయపడుకోవడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.

Advertisement

Sleep On The Floor : నేలపై పడుకుంటే ఎన్ని లాభాలు తెలుసా… ఇక మంచం వద్దని బయట పడేస్తారు…?

Sleep On The Floor  పరుపుపై పడుకుంటే

ఏ రోజుల్లో చాలామంది పరుపు పైన నిద్రిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వెన్ను, మెడ నొప్పి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అదే నేలపై పడుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. నేల గట్టి ఊపరితలాలు సహజ వక్రతకు సపోర్ట్ ఇస్తాయి. మన వెన్నెముకని సరిగ్గా ఉంచి, వెన్ను నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. నేలపై పడుకోవడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. నేలతో అనుబంధం పెరుగుతుంది. పరుపులు, దిండ్ల ఒత్తిడి ఉండదు. మంచి రక్త ప్రసరణ ఉండి, కంటి నిండా నిద్ర పడుతుందని చెబుతున్నారు.నేలపై పడుకోవడం వల్ల శరీర భంగిమ సరైన రీతిలో, వెన్నెముక నిటారుగా ఉంటుంది.

Advertisement

నేలపై పడుకోవడం వల్ల శరీరాన్ని కావలసిన సహజమైన విశ్రాంతి లభిస్తుంది. ఇది మన వీపునునిటారుగా ఉంచుతుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది. మనసులోని ఆందోళనలు తగ్గుతాయి. నేల మీద పడుకోవడం వల్ల జీర్ణక్రియ అవయవాలు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. నేలపై నిద్రపోతున్నప్పుడు నిద్రలో మనకు సహజ శరీర కదలికలు ఉంటాయి, దీనివలన మంచి రక్తప్రసరణ జరుగుతుంది. వేసవిలో నేలపై పడుకుంటే శరీరం వేడి తగ్గుతుంది. మీకు మంచి నిద్ర వస్తుంది. ఎటువంటి బాడీపెయిన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా వెన్నెముక నొప్పి నేలపై పడుకోవడం వల్ల తగ్గిపోతుంది. నేలపై పడుకుంటే ఏకాగ్రత కూడా మెరుగుపడుతుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి