Sneezing : తుమ్ములు ఆపితే మీకు తిప్పలు తప్పవు.. తుమ్ముల వలన కలిగే నష్టాలు ఇవే…!
Sneezing : తుమ్మలపైన చాలా నమ్మకాలు ఉంటాయి. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ సమయాల్లో తుమ్ము వచ్చినా బలవంతంగా అదేవిధంగా అపుతుంటారు.. ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు సినిమా హాల్లో అలాగే క్లాస్ మధ్యలో తుమ్ము వచ్చిన ఆపుతుంటారు.తుమ్ము 100 ఎంపీహెచ్ గంటకు వంద మైల వేగంతో వచ్చే తుమ్మును బలవంతంగా ఆపితే చనిపోయే ప్రమాదం కూడా ఉందంట. లండన్లోని 34 ఏళ్ల కుర్రాడు తుమ్మును ఆపేందుకు ప్రయత్నించాడు. అలా చేయడం వలన అతడికి గొంతు మధ్యలో హోల్ పడింది. గొంతు మధ్య అంతర్గతంగా మారిపోయింది. గాలి బుడగలు, గుండె కండరాలు కణజాలాల్లోకి చేరాయి.
దీనివల్ల ప్రాణానికి ముప్పు వాటినే అవకాశం ఉందని గుర్తించి వెంటనే అతనికి చికిత్స అందించారు. వారం రోజులు పాటు ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత అతను కోలుకున్నాడు. తుమ్ము వల్ల చాలా శక్తివంతమైన గాలి శరీరం నుంచి ముక్కు నోటి ద్వారా బయటికి వస్తుంది. దాన్ని ఆపితే అది శరీరంలోని అంతర్గత భాగాలపై ప్రతి చర్య చూపెడుతుంది. మెదడు కణజాలాలోకి ప్రవేశించి వెంటనే చనిపోయే ప్రమాదం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు. తుమ్మును బలవంతంగా ఆపితే మెదడులోని రక్తనాళాలు సైతం పగిలిపోయే ప్రమాదం ఉందని యూకే లోని యూనివర్సిటీ హాస్పిటల్స్ ఆఫ్ లీడర్ కు చెందిన వైద్య నిపుణులు చెబుతున్నారు… తుమ్ములు వస్తుంటే టవల్ ఉపయోగించండి. ముక్కు నోటిని బలంగా మూసే ప్రయత్నం చేయొద్దు.. బలవంతంగా తుమ్మని ఆపితే చెవిలో కర్ణభేరు పగిలిపోయే అవకాశం ఉంది.. ఈ ఒత్తిడి కారణంగా కర్ణభేరి పగిలిపోతుంది.
తుమ్ములు ముక్కు నోటిలోని దుమ్ముదులిని బ్యాక్టీరియాని బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంటాయి.కాబట్టి తుమ్మును ఆపే ప్రయత్నం అసలు చేయవద్దు.. బలవంతంగా తుమ్ముని ఆపితే మీ నాసిక నాలాల నుంచి గాలిని చెవుల వైపు మళ్ళిస్తుంది. అప్పుడు చెవి కర్ణబేరు పగిలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అస్సలు తుమ్మని ఆపే ప్రయత్నాలు చేయకండి. తుమ్ము వస్తుంటే టవలను రుమాళ్లను ఉపయోగించండి. తుమ్ములు ఎక్కువగా వస్తుంటే వైద్యని సలహా తీసుకొని చికిత్స పొందండి.