Oral Cancer Symptoms : గొంతు నొప్పి, మింగటం లో ఇబ్బందా…అయితే ఈ ప్రాణాంతక వ్యాధే కారణం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Oral Cancer Symptoms : గొంతు నొప్పి, మింగటం లో ఇబ్బందా…అయితే ఈ ప్రాణాంతక వ్యాధే కారణం…!!

 Authored By ramu | The Telugu News | Updated on :27 May 2024,7:00 am

Oral Cancer Symptoms : భారత్ లో నోటి క్యాన్సర్ కేసుల సంఖ్య రోజురోజుకు ఎంతగానో పెరిగిపోతున్నాయి. సిగరెట్లు, బీడీలు, ఖైనీ, గుట్కా లాంటి ఇతర పొగాకుల ఉత్పత్తులను వాడే అలవాటు వలన ఈ ప్రాణాంతక వ్యాధి అనేది వస్తుంది. అయితే పొగాకు ఉత్పత్తులతో పాటుగా ఆల్కహాల్ కూడా ఈ సమస్యలను కలిగిస్తుంది. ఇది అనేది HPV వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నోటి క్యాన్సర్ అనేది నోటిలోని ఇతర భాగాలకు వస్తుంది. పెదవులు, నాలుక, చెంప, లోపలి భాగం చిగుళ్ళు, అంగలి, నోటిలోని ఏ భాగానికైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.

కావున దాని లక్షణాలను గుర్తించటం చాలా ముఖ్యం… చాలా మందికి ప్రతిరోజు కూడా ధూమపానం చేసే అలవాటు ఉంటుంది. దీనివలన నోటి లోపల తెల్లని మచ్చలు అనేవి ఏర్పడతాయి. అందువలన నోటిలో ఎరుపు లేక తెల్లని మచ్చల తో నిండి ఉన్నట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించటం చాలా అవసరం. నోటి లోపల నొప్పి అనేది లేకుండా వాపు ఉన్నా కూడా ఆందోళన పడాల్సిందే.

నోటి లోపల గడ్డలు లాంటివి గనుక ఏర్పడినట్లయితే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. నాలుక కదలికలో ఇబ్బంది లేక మాట్లాడేటప్పుడు ఏదైనా సమస్య లేక ఆవలింత వచ్చినప్పుడు తడబడినట్లు అనిపించినట్లయితే వెంటనే వైద్యుని సలహా తీసుకోవటం మంచిది.. జలుబు లేక వైరల్ జ్వరం, గొంతులో నొప్పి,మింగటంలో ఇబ్బంది ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. ఆ నొప్పి అనేది స్వల్ప కాలికంగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ నొప్పి అనేది దీర్ఘకాలం గా ఉన్నట్లయితే వెంటనే జాగ్రత్త పడాలి..

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది