Sugar Patients : డయాబెటిస్ పేషెంట్లు గుడ్లు తినవచ్చా… ఒకవేళ తింటే ఏం జరుగుతుంది…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sugar Patients : డయాబెటిస్ పేషెంట్లు గుడ్లు తినవచ్చా… ఒకవేళ తింటే ఏం జరుగుతుంది…?

 Authored By ramu | The Telugu News | Updated on :4 July 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Sugar Patients : డయాబెటిస్ పేషెంట్లు గుడ్లు తినవచ్చా... ఒకవేళ తింటే ఏం జరుగుతుంది...?

Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా జాగ్రత్త వహించాలి. పూర్తిగా నయం చేయలేని డయాబెటిస్ ఎప్పటికప్పుడు నియంత్రణలోకి ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. సారీ షుగర్ బ్లడ్ లో వచ్చిన తరువాత ఆహార విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అసలు వీరు ఎలాంటి ఆహారాలు తినాలి, ఎలాంటివి తినకూడదు. అనే విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.ఈ క్రమంలో మధుమేహ బాధితులకు గుడ్డు తింటే ఏమవుతుంది. తినొచ్చా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ అంశంపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

Sugar Patients డయాబెటిస్ పేషెంట్లు గుడ్లు తినవచ్చా ఒకవేళ తింటే ఏం జరుగుతుంది

Sugar Patients : డయాబెటిస్ పేషెంట్లు గుడ్లు తినవచ్చా… ఒకవేళ తింటే ఏం జరుగుతుంది…?

షుగర్ వ్యాధిని సరైన ఆహారం, వ్యాయామంతో పూర్తిగా నియంత్రించుకోవచ్చు. వయసు పెరుగుతుండగా మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే, డయాబెటిస్ ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. లేకుంటే అంత మంచిది కాదు అంటున్నారు నిపుణులు.

Sugar Patients  డయాబెటిస్ పేషెంట్లు గుడ్లు తింటే

గుడ్లు మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు,పోషకాలతో నిండి ఉన్న మంచి పోషకాహారం అంటున్నారు నిపుణులు. శరీరాకృతిని కాపాడుకోవాలని కునేవారు, రోజు ఒక గుడ్డును తినడం అలవాటు చేసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. డయాబెటిస్ ఉన్నవారికి కోడి గుడ్డు సరేనా ఆహారమే.అయితే, మితంగా తీసుకుంటే మాత్రమే అది సరైన ఫలితాన్ని ఇస్తుంది. షుగర్ బాధితులు వారానికి మూడు లేదా అంతకంటే, ఎక్కువ గుడ్లు తింటే రక్తంలో చక్కెర 39 శాతం పెరుగుతాయని ఒక అధ్యాయంలో వెల్లడించారు.ముఖ్యంగా, చైనాలో ప్రజలు దీని బారిన పడుతున్నారు. అయితే, షుగర్ ఉన్నవారు కోడిగుడ్ల విషయానికొస్తే వీటిలో బయోటిన్,పొటాషియం,యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇక గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడంలో చక్కర స్థాయిలపై ప్రభావం చూపదు. దీనివల్ల షుగర్ ఉన్న వారు కూడా నిజంగా గుడ్లను తినొచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా,ఫ్రీ డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్ ఉన్న వారిలో గుడ్లు వల్ల గుండె సమస్యలు తగ్గినట్లు అధ్యయనంలో వెల్లడయ్యాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదే.ఏడాది పాటు వారానికి 12 గుడ్లు చొప్పున తినే మధుమేహ బాధితులకు గుండె జబ్బులు ముప్పు ఉండదట.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది