Tea : ఉదయాన్నే ఛాయ్ తో పాటు బిస్కెట్ తింటే… మీ ప్రాణాలు డేంజర్ లో పడ్డట్టే… జాగ్రత్త…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea : ఉదయాన్నే ఛాయ్ తో పాటు బిస్కెట్ తింటే… మీ ప్రాణాలు డేంజర్ లో పడ్డట్టే… జాగ్రత్త…??

 Authored By ramu | The Telugu News | Updated on :10 November 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Tea : ఉదయాన్నే ఛాయ్ తో పాటు బిస్కెట్ తింటే... మీ ప్రాణాలు డేంజర్ లో పడ్డట్టే... జాగ్రత్త...??

Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే కాదు వాటిలో బిస్కెట్లు ముంచుకొని తినే అలవాటు ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కు బదులుగా వీటినే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే పరిగడుపున చాయ్ బిస్కెట్ తీసుకోవడం అనేది అంత మంచిది కాదు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఈ టీలో కెఫిన్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాగే బిస్కెట్ లో చక్కెరతో పాటు కెఫిన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ రెండింటిని కలిపి తీసుకోవటం వలన శరీరంలో కొవ్వు అనేది బాగా పెరుగుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

బిస్కెట్లలో ప్రాసెస్ చేసిన చక్కెరతో పాటుగా గోధుమ పిండి కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీనిలో సంతృప్త కొవ్వులు కూడా అధికంగా ఉంటాయి. కావున ఇది శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. అంతేకాక బిస్కెట్ లో ఉండే పదార్థాలు అనేవి వేగంగా బరువు పెరగడానికి హెల్ప్ చేస్తాయి. అంతేకాక పొట్ట ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయి. ముఖ్యంగా వీటిని పరిగడుపున తీసుకోవడం వలన గ్యాస్ మరియు అసిడిటీ లాంటి సమస్యలకు దారి తీస్తాయి అని అంటున్నారు నిపుణులు. దీని వలన అజీర్ణం మరియు కడుపులో ఇబ్బందిగా ఉండటం లాంటి సమస్యలు వేధిస్తాయి అని అంటున్నారు.

Tea ఉదయాన్నే ఛాయ్ తో పాటు బిస్కెట్ తింటే మీ ప్రాణాలు డేంజర్ లో పడ్డట్టే జాగ్రత్త

Tea : ఉదయాన్నే ఛాయ్ తో పాటు బిస్కెట్ తింటే… మీ ప్రాణాలు డేంజర్ లో పడ్డట్టే… జాగ్రత్త…??

మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఉప్పు కంటెంట్ ఎక్కువగా ఉండే బిస్కెట్లను పరిగడుపున తీసుకుంటే అధిక రక్తపోటుకు దారితీస్తుంది అని అంటున్నారు. అలాగే వీటిని ప్రతి రోజు పరిగడుపున తీసుకుంటే గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకాక ఈ బిస్కెట్లలో ఉండే సుక్రలోజ్ మరియు అస్పర్టమే జీవక్రియను నెమ్మది చేస్తుంది. ఇది జీర్ణ సమస్యలకు కూడా దారితీస్తుంది. అందుకే ఛాయ్ తో పాటుగా బిస్కెట్లు తినడం అంత మంచిది కాదు అని అంటున్నారు నిపుణులు…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది