మన ఇంటి చుట్టుపక్కల ఉంటే మొక్కల్లో అనేక సుగుణాలు ఉన్నాయి. వాటి గురించి మనకి సరిగ్గా తెలియక పోవటం వలన వాటిని మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. ముఖ్యంగా మన ఇంటి పక్కన ఎక్కువగా కనిపించే బిళ్ల గన్నేరు మొక్కల గురించి ఎవరికీ సరిగ్గా తెలియకపోవచ్చు, పింగ్, రంగుల్లో ఈ పూలు పూస్తాయి. సంస్కృతంలో వీటిని సదా పుష్ప అని పిలుస్తారు. ఎప్పటికి పూలు పూస్తుందని అర్ధం. దీన్నే హిందీలో సదా బహార్ అని ఇంగ్లిష్ లో పెరివింకిల్ అని, వింకా రోసియా అని పిలుస్తారు..
1. శరీరంపై పుండ్లు, గాయాలు త్వరగా మానిపోవటానికి ఈ మొక్కలు బాగా ఉపయోగపడుతాయి. బిళ్ల గన్నేరు ఆకులకు, పసుపును తీసుకోని వాటిని పేస్ట్ లాగా చేసి గాయాలు, పుండ్లు మీద రోజుకి మూడు సార్లు రాస్తే, త్వరగా మానుతాయి.
2. డయాబెటిస్ తో బాధపడే వారికీ ఈ మొక్కలు మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. బిళ్ళ గన్నేరు వేర్లు తీసుకోని వాటిని శుభ్రంగా కడిగి, వాటిని నీడలో వెండబెట్టాలి. ఆ తర్వాత వాటిని పొడి చేయాలి. ఆ పొడిని చిటికెడు మోతాదులో తీసుకోని దానికి ఒక చెంచా తేనే కలిపి రోజుకి రెండు సార్లు ఉదయం, సాయంత్రం భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. ఇలా చేయటం వలన షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. టైపు 2 డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
3. హైబీపీ ఉన్న వాళ్ళు కు కూడా ఈ మొక్క వలన అనేక లాభాలు ఉన్నాయి. బిళ్ళ గన్నేరు మొక్క ఆకులూ 5 తీసుకోని వాటి నుండి రసం తీసుకోవాలి. ఆ రసాన్ని 2-3 ఎం ఎల్ మోతాదులో తీసుకోని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. అదే విధంగా రాత్రి నిద్రపోయే ముందు కూడా తీసుకుంటే మంచిది. దీని వలన హైబీపీ నియంత్రణలో ఉంటుంది.
4. స్త్రీలలో రుతుక్రమం సమస్య ఎక్కవుగా ఉంటుంది. ఆ సమస్యను నివారించటానికి బిళ్ళ గన్నేరు మొక్కలు బాగానే ఉపయోగపడుతాయి. బిళ్ళ గన్నేరు ఆకులను 8 తీసుకోని శుభ్రంగా కడిగి వాటిని 2 కప్పుల నీటిలో మరిగించాలి. అరకప్పు నీరు అయ్యే వరకు కషాయం కాయాలి. రోజు పరగడుపున 3 నెలలు తీసుకోవాలి. ఇలా చేయటం వలన హార్మోన్స్ సమస్యలు తగ్గి, రుతు సమయంలో రక్త స్రావం తగ్గటమే కాకుండా, నొప్పులు తగ్గుతాయి.
5. ముక్కు నుండి కానీ, నోటి నుండి కానీ రక్త స్రావం అవుతుంటే దానిని నివారించట్నీకి బిళ్ళ గన్నేరు పువ్వులు బాగానే ఉపయోగపడుతాయి. బిళ్ళ గన్నేరు పువ్వులు, దానిమ్మ పువ్వులు కలిసి వాటి నుండి రసం తీసి, వాటిని ముక్కులో, నోటిలోని చిగుళ్లు మీద ఈ మిశ్రమాన్ని వేస్తే ఆ సమస్య నుండి బయటపడవచ్చు. ఇలా చేస్తే నోట్లో పుండ్లు,పొక్కులు కూడా తగ్గుతాయి.
6. బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్, పసుపు, వేపాకుల పేస్ట్ రాసుకుంటే మొటిమలు మచ్చలు కూడా తగ్గుతాయి. బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ కీటకాలు, పురుగులు కుట్టిన చోట కూడా రాసుకోవచ్చు. అయితే ఈ మొక్కల వలన ఎన్ని లాభాలు ఉన్నాయో, అదే విధంగా నష్టాలు కూడా వున్నాయి, పైన చెప్పిన చిట్కాలు అన్ని మనకున్న వ్యాధి తీవ్రతను బట్టి దానికి తగ్గ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ప్రాణానికి అపాయం కలిగే అవకాశం ఉంది. వీటిని ఉపయోగించే ముందు దానికి సంబంధించిన డాక్టర్ ను సంప్రదించటం ఉత్తమం. ముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, అల్సర్లు ఉన్నవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని తీసుకోకూడదు.
ఇది కూడా చదవండి ==> రోజూ ఒక గ్లాస్ తిప్పతీగ జ్యూస్ తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..!
ఇది కూడా చదవండి ==> రావి చెట్టు ఆరోగ్య ప్రయోజనాలు.. ఏటువంటి వ్యాధులను నయం చేస్తాయో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> హై బీపీ మీమ్మలని బాగా ఇబ్బంది పెడుతూందా.. అయితే మీరు ఇవి తినడంలేదని అర్ధం..?
ఇది కూడా చదవండి ==> మీకు షుగర్ వ్యాధి ఉందా.. అయితే ఈ ఆహరాలను తినడం మానుకొవాల్సిందే..!
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.