ThippaTheega : రోజూ ఒక గ్లాస్ తిప్పతీగ జ్యూస్ తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!
ThippaTheega : కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిప్పతీగ పేరు బాగా వినిపిస్తోంది. తిప్ప తీగ వల్ల ఆరోగ్యపరమైన తిప్పలెన్నో తప్పుతాయి. తిప్ప తీగ జ్యూస్ తాగిన చాలా మంది చెబుతున్న మాట ఇది. అద్భుతమైన ఆయుర్వేద గుణాలు కలిగిన ఈ తిప్ప తీగను ఆనందయ్య కూడా తన మందు తయారీలో వాడుతుండటం చెప్పుకోదగ్గ విషయం. ప్రస్తుతం మార్కెట్ లో తిప్ప తీగ.. పౌడర్, జ్యూస్ రూపంలో దొరుకుతోంది. వివిధ కంపెనీలు వీటిని తయారు చేసి అమ్ముతున్నాయి. అయితే తిప్ప తీగ ఉత్పత్తులను ఎలా ఉపయోగించాలి? అనే విషయాలు చాలా మందికి తెలియవు. అందుకే ఈ స్టోరీ..
పొద్దున్నే.. పరిగడుపునే.. ThippaTheega
తిప్ప తీగ జ్యూస్ ని రోజూ పొద్దున్నే మొహం కడుక్కున్న తర్వాత ఏమీ తినకముందే అంటే పరిగడుపునే తాగాలి. రెండు నుంచి మూడు టీ స్పూన్ల తిప్పతీగ జ్యూస్ ని తీసుకోవాలి. తిప్ప తీగ జ్యూస్ ని తాగిన అర్ధ గంట తర్వాత టిఫిన్ చేయాలి. అలా చేస్తే మందు బాగా పని చేస్తుంది. తిప్ప తీగ జ్యూస్ ని తాగటం వల్ల జ్వరం తగిలినా తగ్గిపోతుంది. షుగర్ రెండో దశలో ఉన్న పేషెంట్లు తిప్ప తీగ జ్యూస్ తీసుకుంటే చక్కెర స్థాయిలు ఎక్కువ, తక్కువ కాకుండా నార్మల్ గా ఉంటాయి. అంటు వ్యాధులు కూడా మనల్ని అంటుకోకుండా దూరంగా ఉండిపోతాయి. బాడీలో ఇమ్యునిటీ పవర్ పెరగటం వల్ల ఇతర రోగాలు మన దరి చేరవు. ఒకవేళ చేరినా త్వరగా నయమైపోతాయి.
అరగకపోవటం అనేదే.. : ThippaTheega
తిప్ప తీగ జ్యూస్ ని తాగినవాళ్లకు తిండి అరగకపోవటం అనేదే ఉండదు. విరేచనం సాఫీగా జరుగుతుంది. జీర్ణ సమస్యలు తలెత్తవు. కాబట్టి గ్యాస్ ప్రాబ్లం వంటివి రావు. మానసికపరమైన సమస్యలూ తొలగుతాయి. ఒత్తిడి, ఆందోళన ఇబ్బంది పెట్టవు. కంటి చూపు మందగించదు. ఒక్క మాటలో చెప్పాలంటే తిప్ప తీగ జ్యూస్ ని సర్వ రోగ నివారిణిగా పేర్కొనొచ్చు. తిన్న ప్రతి ఆహార పదార్థమూ చక్కగా అరుగుతుందంటే ఒంట్లో ఎనర్జీకి ఢోకా ఉండదు.
ఉచితంగా కూడా.. ThippaTheega
తిప్ప తీగను డబ్బులిచ్చి కొనాల్సిన పని లేదు. సహజంగానే దొరుకుతుంది. పల్లెటూళ్లల్లో అయితే చేలల్లో, పొలాల్లో, సిటీలో అయితే పార్కుల్లో, గార్డెన్లలో ఉంటుంది. కాకపోతే దాన్ని గుర్తుపట్టగలిగితే చాలు. తిప్ప తీగ జ్యూస్, పౌడర్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందువల్ల తిప్ప తీగను ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధం అని చెప్పొచ్చు. కొవిడ్ సెకండ్ వేవ్ ఎంత భయపెట్టిందో చూశాం కదా. కాబట్టి వెంటనే తిప్ప తీగ జ్యూస్ ని తాగటం అలవాటు చేసుకుంటే కరోనా వంటి మహమ్మార్లను తేలిగ్గానే తరిమికొట్టొచ్చు.
ఇది కూడా చదవండి ==> రావి చెట్టు ఆరోగ్య ప్రయోజనాలు.. ఏటువంటి అనారోగ్యాలను నయం చేస్తాయో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే … రోజు పరగడుపున ఇవి తాగండి…?
ఇది కూడా చదవండి ==> బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా? ఇలా చేస్తే మీ బొడ్డు నాజూగ్గా మారడం ఖాయం..!
ఇది కూడా చదవండి ==> నిద్ర లేవగానే మీరు వెంటనే మొబైల్ చూస్తున్నారా.. అయితే మీకు ఈ జబ్బు ఉన్నట్లే..?