
Amazing benefits of drinking ginger juice daily
Ginger Juice : ఎంతో పురాతన కాలం నుంచి పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడానికి అల్లం వాడుతున్నారు. అల్లంతో మన శరీరానికి అవసరమైన కీలక పోషకాలు కూడా ఉన్నాయి. ఇందులో సహజసిద్ధమైన గుణాలు ఉన్నాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలోనే రోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. కీళ్ల నొప్పులు వాపులు తగ్గుతాయి.. శరీరానికి కావాల్సిన జింక్ మెగ్నీషియం పొటాషియంలు సమృద్ధిగా ఈ అల్లం రసంలో ఉంటాయి. ఇవి నొప్పులు తగ్గిస్తాయి. శరీరంలో ఎక్కువగా నీరు చేరుతుంటే పరిష్కారం చూపుతుంది.
అల్లం రసం తాగితే ఒంట్లో అధికంగా ఉన్న నీరు బయటకు వెళ్ళిపోతుంది. ఇన్ఫెక్షన్లు ఉన్నవారు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అల్లం రసం తాగితే మంచి ఫలితం కనిపిస్తోంది. అలాంటి వారు అల్లం రసం తాగితే ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ వృద్ధాప్య ఛాయాలను దరిచేయవు. దీంతో ఎప్పటికీ యంగ్ గా కనిపిస్తారు. చర్మం వెంట్రుకలు గోళ్ళు ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు వయసు మీద పడడం వల్ల ఉంటాయి.అల్లం రసం ప్రయాణ సమయంలో తాగితే ప్రయాణంలో ఉండే వికారం వాంతులు రాకుండా ఉంటాయి. అంతేకాదు గర్భిణీ స్త్రీలలో వికారం వాంతులు అధికంగా ఉంటాయి. అలాంటప్పుడు అల్లం తినటం ద్వారా వాంతులు వికారం తగ్గుతాయి. అజీర్తి తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు.
Amazing benefits of drinking ginger juice daily
గుండెలో మంట అనిపించినప్పుడు అల్లం టీ తాగితే తగ్గుతుంది. అల్లంతో సహజ పద్ధతిని ఇలా పాటిస్తే మొటిమలు పోతాయి. అల్లం రసంలో దూదిని ఉంచి మొటిమలపై రాస్తుంటే మొటమలు తగ్గుతాయి. చర్మం మంటగా అనిపించిన చోట అల్లం రసం రాస్తే మంట పోతుంది. పాదాలపై బ్యాక్టీరియా దుమ్ముపోయి పాదాలు ఆరోగ్యంగా చూడటానికి అందంగా ఉండాలంటే బకెట్లో లైట్ హీట్ వాటర్ లో అల్లం రసం కలిపి పాదాలు అందులోంచి అరగంట రిలాక్స్ అయితే చాలు.. మీ పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. అల్లం రసంలో నిమ్మరసం తేనె కలిపి బాగా మిక్స్ చేసి ముఖంపై అప్లై చేసి పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగితే స్కిన్ టోన్ బాగుంటుంది.
చర్మం అందంగా కాంతివంతంగా ఉండటమే కాక ముఖంపై అనేక కారణాల్లో వచ్చిన మచ్చలు పోతాయి. అల్లం పేస్ట్ నుదుటిపై నొసలపై అప్లై చేసి రిలాక్స్ అయితే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న అల్లాన్ని మనం తరచూ ఉపయోగించి దానిలోని పోషక విలువలు పొంది ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితం గడపాలి…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.