Ginger Juice : పరిగడుపున అల్లం రసం తాగితే కలిగే అద్భుతమైన లాభాలు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ginger Juice : పరిగడుపున అల్లం రసం తాగితే కలిగే అద్భుతమైన లాభాలు ఇవే…!

Ginger Juice : ఎంతో పురాతన కాలం నుంచి పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడానికి అల్లం వాడుతున్నారు. అల్లంతో మన శరీరానికి అవసరమైన కీలక పోషకాలు కూడా ఉన్నాయి. ఇందులో సహజసిద్ధమైన గుణాలు ఉన్నాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలోనే రోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగితే […]

 Authored By aruna | The Telugu News | Updated on :9 September 2023,7:00 am

Ginger Juice : ఎంతో పురాతన కాలం నుంచి పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడానికి అల్లం వాడుతున్నారు. అల్లంతో మన శరీరానికి అవసరమైన కీలక పోషకాలు కూడా ఉన్నాయి. ఇందులో సహజసిద్ధమైన గుణాలు ఉన్నాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలోనే రోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. కీళ్ల నొప్పులు వాపులు తగ్గుతాయి.. శరీరానికి కావాల్సిన జింక్ మెగ్నీషియం పొటాషియంలు సమృద్ధిగా ఈ అల్లం రసంలో ఉంటాయి. ఇవి నొప్పులు తగ్గిస్తాయి. శరీరంలో ఎక్కువగా నీరు చేరుతుంటే పరిష్కారం చూపుతుంది.

అల్లం రసం తాగితే ఒంట్లో అధికంగా ఉన్న నీరు బయటకు వెళ్ళిపోతుంది. ఇన్ఫెక్షన్లు ఉన్నవారు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అల్లం రసం తాగితే మంచి ఫలితం కనిపిస్తోంది. అలాంటి వారు అల్లం రసం తాగితే ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ వృద్ధాప్య ఛాయాలను దరిచేయవు. దీంతో ఎప్పటికీ యంగ్ గా కనిపిస్తారు. చర్మం వెంట్రుకలు గోళ్ళు ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు వయసు మీద పడడం వల్ల ఉంటాయి.అల్లం రసం ప్రయాణ సమయంలో తాగితే ప్రయాణంలో ఉండే వికారం వాంతులు రాకుండా ఉంటాయి. అంతేకాదు గర్భిణీ స్త్రీలలో వికారం వాంతులు అధికంగా ఉంటాయి. అలాంటప్పుడు అల్లం తినటం ద్వారా వాంతులు వికారం తగ్గుతాయి. అజీర్తి తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు.

Amazing benefits of drinking ginger juice daily

Amazing benefits of drinking ginger juice daily

గుండెలో మంట అనిపించినప్పుడు అల్లం టీ తాగితే తగ్గుతుంది. అల్లంతో సహజ పద్ధతిని ఇలా పాటిస్తే మొటిమలు పోతాయి. అల్లం రసంలో దూదిని ఉంచి మొటిమలపై రాస్తుంటే మొటమలు తగ్గుతాయి. చర్మం మంటగా అనిపించిన చోట అల్లం రసం రాస్తే మంట పోతుంది. పాదాలపై బ్యాక్టీరియా దుమ్ముపోయి పాదాలు ఆరోగ్యంగా చూడటానికి అందంగా ఉండాలంటే బకెట్లో లైట్ హీట్ వాటర్ లో అల్లం రసం కలిపి పాదాలు అందులోంచి అరగంట రిలాక్స్ అయితే చాలు.. మీ పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. అల్లం రసంలో నిమ్మరసం తేనె కలిపి బాగా మిక్స్ చేసి ముఖంపై అప్లై చేసి పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగితే స్కిన్ టోన్ బాగుంటుంది.

చర్మం అందంగా కాంతివంతంగా ఉండటమే కాక ముఖంపై అనేక కారణాల్లో వచ్చిన మచ్చలు పోతాయి. అల్లం పేస్ట్ నుదుటిపై నొసలపై అప్లై చేసి రిలాక్స్ అయితే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న అల్లాన్ని మనం తరచూ ఉపయోగించి దానిలోని పోషక విలువలు పొంది ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితం గడపాలి…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది