Green Tea : ప్రస్తుత కాలంలో గ్రీన్ టీ తీసుకునే అలవాటు నానాటికి బాగా పెరిగిపోతుంది. అలాగే తమ ఆరోగ్యం పై అవగాహన పెరుగుతున్న తరుణంలో గ్రీన్ టీ ని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కరోనా మహమ్మారి వచ్చి పోయిన తర్వాత గ్రీన్ టీ అలవాటు మరింత ఎక్కువైంది. అలాగే ఈ గ్రీన్ టీ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అని నిపుణులు అంటున్నారు. అయితే మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఈ గ్రీన్ టీ ని తీసుకునే విధానంలో కూడా కొన్ని జాగ్రత్తలను పాటించాలి అని నిపుణులు అంటున్నారు. ఇంతకీ గ్రీన్ టీ ని తీసుకునే టైంలో చేయకూడని ఆ తప్పులు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
– కొంతమంది ఆహారం తిన్న వెంటనే గ్రీన్ టీ ని తాగుతూ ఉంటారు. అయితే ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వలన ఐరన్ సంగ్రహనం లో సమస్య అనేది వస్తుంది. అలాగే ఇది శరీరంలో ఐరన్ లోపానికి కూడా దారితీస్తుంది. అందుకే ఆహారం తిన్న గంట తర్వాత మాత్రమే గ్రీన్ టీ ని తీసుకోవాలి.
– గ్రీన్ టీ ని రోజుకు రెండు లేక మూడు కప్పుల కంటే ఎక్కువగా తీసుకోకూడదు అని నిపుణులు అంటున్నారు. ఈ గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనేది ఎంత నిజమో, ఎక్కువగా తీసుకుంటే నిద్రలేమి మరియు ఆందోళన, జీర్ణ సమస్యలు రావడం పక్కా అని నిపుణులు అంటున్నారు.
– కొన్ని రకాల మందులు వేసుకున్న వెంటనే గ్రీన్ టీ ని తాగటం మంచిది కాదు అని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చెప్పాలంటే రక్తాన్ని పల్చగా మార్చే మందులు మరియు డిప్రెషన్,హైబీపీ లాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు గ్రీన్ టీ ని తీసుకునే ముందు వైద్యులను కచ్చితంగా సంప్రదించాలి.
– బాగా ఉడికిన నీళ్లతో కూడా గ్రీన్ టీ ని తీసుకోవడం మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు. ఇలా చేయటం వలన దానిలో ఉన్న పోషకాలు అనేవి నశిస్తాయి. అందుకే 80 నుండి 85 డిగ్రీల ఉష్ణోగ్రత దాటకుండా చూసుకుంటే మంచిది అని అంటున్నారు నిపుణులు.
– గ్రీన్ టీ లో కేఫిన్ కూడా ఉంటుంది. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. అందుకే పడుకునే ముందు గ్రీన్ టీ తీసుకోవటం అస్సలు మంచిది కాదు. మీరు పడుకునే ముందు రెండు లేక మూడు గంటలు ముందు గ్రీన్ టీ ని తీసుకోవాలి.
– ఎసిడిటీ మరియు అల్సర్ లాంటి జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు గ్రీన్ టీ కి దూరంగా ఉంటేనే మంచిది. దీనిలో ఉండే ట్యానిన్ ఎసిడిటీని మరింత ఎక్కువ చేస్తుంది అని నిపుణులు అంటున్నారు…
EPS New System : ఉద్యోగుల పెన్షన్ స్కీం తో పాటు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. 2025…
Rice Water : ప్రస్తుత కాలంలో చాలా మంది తమ జుట్టు ఆరోగ్యం కోసం సహజ పద్ధతులను మరియు ఇంటి చిట్కాలపై…
TG Govt Skills University Jobs : ప్రపంచస్థాయి నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా…
Pumpkin Seeds : గుమ్మడి గింజలు అనేవి చూడటానికి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కానీ వీటిని ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో…
Tulasi Vivaham : హిందూమతంలో తులసి శ్రీ మహావిష్ణువు రూపమైన శాలి గ్రాముల వివాహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక…
Work From Home Jobs : ఇంట్లో ఇద్దరు జాబ్ చేస్తేనే కానీ ఇల్లు గడవని పరిస్థితి ఉంది. ఎంత…
Telangana : తెలంగాణలో నిరుద్యోగ యువత పెరిగింది. నిరుద్యోగంలో దేశంలో రాష్ట్రం ముందుంది. రాష్ట్రంలోని 15 నుండి 29 సంవత్సరాల…
Nagula Chavithi : కార్తీక మాసంలో శుద్ధ శుక్ల పక్ష చవితి రోజున నాగుల చవితిని జరుపుకుంటారు. ఈ ఏడాది…
This website uses cookies.