Green Tea : గ్రీన్ టీ అలవాటు ఉన్నవారు ఈ తప్పులు అస్సలు చేయకండి…!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: November 3, 2024, 8:00 am
  •  Green Tea : గ్రీన్ టీ అలవాటు ఉన్నవారు ఈ తప్పులు అస్సలు చేయకండి...!

Green Tea : ప్రస్తుత కాలంలో గ్రీన్ టీ తీసుకునే అలవాటు నానాటికి బాగా పెరిగిపోతుంది. అలాగే తమ ఆరోగ్యం పై అవగాహన పెరుగుతున్న తరుణంలో గ్రీన్ టీ ని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కరోనా మహమ్మారి వచ్చి పోయిన తర్వాత గ్రీన్ టీ అలవాటు మరింత ఎక్కువైంది. అలాగే ఈ గ్రీన్ టీ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అని నిపుణులు అంటున్నారు. అయితే మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఈ గ్రీన్ టీ ని తీసుకునే విధానంలో కూడా కొన్ని జాగ్రత్తలను పాటించాలి అని నిపుణులు అంటున్నారు. ఇంతకీ గ్రీన్ టీ ని తీసుకునే టైంలో చేయకూడని ఆ తప్పులు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

– కొంతమంది ఆహారం తిన్న వెంటనే గ్రీన్ టీ ని తాగుతూ ఉంటారు. అయితే ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వలన ఐరన్ సంగ్రహనం లో సమస్య అనేది వస్తుంది. అలాగే ఇది శరీరంలో ఐరన్ లోపానికి కూడా దారితీస్తుంది. అందుకే ఆహారం తిన్న గంట తర్వాత మాత్రమే గ్రీన్ టీ ని తీసుకోవాలి.

– గ్రీన్ టీ ని రోజుకు రెండు లేక మూడు కప్పుల కంటే ఎక్కువగా తీసుకోకూడదు అని నిపుణులు అంటున్నారు. ఈ గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనేది ఎంత నిజమో, ఎక్కువగా తీసుకుంటే నిద్రలేమి మరియు ఆందోళన, జీర్ణ సమస్యలు రావడం పక్కా అని నిపుణులు అంటున్నారు.

– కొన్ని రకాల మందులు వేసుకున్న వెంటనే గ్రీన్ టీ ని తాగటం మంచిది కాదు అని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చెప్పాలంటే రక్తాన్ని పల్చగా మార్చే మందులు మరియు డిప్రెషన్,హైబీపీ లాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు గ్రీన్ టీ ని తీసుకునే ముందు వైద్యులను కచ్చితంగా సంప్రదించాలి.

– బాగా ఉడికిన నీళ్లతో కూడా గ్రీన్ టీ ని తీసుకోవడం మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు. ఇలా చేయటం వలన దానిలో ఉన్న పోషకాలు అనేవి నశిస్తాయి. అందుకే 80 నుండి 85 డిగ్రీల ఉష్ణోగ్రత దాటకుండా చూసుకుంటే మంచిది అని అంటున్నారు నిపుణులు.

– గ్రీన్ టీ లో కేఫిన్ కూడా ఉంటుంది. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. అందుకే పడుకునే ముందు గ్రీన్ టీ తీసుకోవటం అస్సలు మంచిది కాదు. మీరు పడుకునే ముందు రెండు లేక మూడు గంటలు ముందు గ్రీన్ టీ ని తీసుకోవాలి.

Green Tea : గ్రీన్ టీ అలవాటు ఉన్నవారు ఈ తప్పులు అస్సలు చేయకండి...!

Green Tea : గ్రీన్ టీ అలవాటు ఉన్నవారు ఈ తప్పులు అస్సలు చేయకండి…!

– ఎసిడిటీ మరియు అల్సర్ లాంటి జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు గ్రీన్ టీ కి దూరంగా ఉంటేనే మంచిది. దీనిలో ఉండే ట్యానిన్ ఎసిడిటీని మరింత ఎక్కువ చేస్తుంది అని నిపుణులు అంటున్నారు…

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp