1. ఒక గిన్నెలో రెండు మూడు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ చొప్పున పెరుగు, కీరదోస గుజ్జు, రెండు టీ స్పూన్ల శనగపిండిలను వేసి బాగా కలపాలి. తరువాత పాలు పోస్తూ మెత్తని మిశ్రమంగా చేయాలి. దాన్ని ముఖం, మెడకు రాయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. ప్రకాశిస్తుంది.
2. రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒకటిన్నర టీస్పూన్ల నిమ్మరసం, చిటికెడు పసుపులను తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాల్లో మాస్క్‌లా రాయాలి. తరువాత బాగా ఆరిపోయాక తడి చేత్తో రుద్దుతూ మొత్తం కడిగేయాలి. దీంతో బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుతుంది.
3. రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీమట్టిలో అంతే మోతాదులో బంగాళాదుంపల గుజ్జును కలిపి ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. బాగా ఆరాక కడిగేయాలి. దీంతో ఎండ వల్ల రంగు మారిన చర్మం తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటుంది.
4. రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కొబ్బరి నీళ్లు, పావు టేబుల్ స్పూన్ చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో ఎండ వల్ల కందిన చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది.
5. ఒక గుడ్డు తెల్లసొనలో రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, కొద్దిగా నీళ్లు కలిపి మెత్తని పేస్టులా తయారు చేయాలి. దాన్ని ముఖానికి రాయాలి. అనంతరం 20 నిమిషాలు ఆగాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో చర్మం దృఢంగా ఉంటుంది. సాగిపోయినట్లు కనిపించదు.
6. చర్మం పొడిబారిపోయే సమస్య ఉన్నవారు రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీమట్టిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని మాస్క్‌లా వేయాలి. 30 నిమిషాల నుంచి 60 నిమిషాల పాటు ఆగాక కడిగేయాలి. దీంతో చర్మం తేమగా మారుతుంది. మృదుత్వం వస్తుంది.
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
This website uses cookies.