Multani Mitti : చర్మ సమస్యలకు ముల్తానీ మట్టిని ఇలా ఉపయోగించండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Multani Mitti : చర్మ సమస్యలకు ముల్తానీ మట్టిని ఇలా ఉపయోగించండి..!

Multani Mitti : ముఖాన్ని కాంతివంతంగా మార్చడంతోపాటు పలు చర్మ సమస్యలను తగ్గించడంలో ముల్తానీ మట్టి అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల చర్మం మృదువుగా కూడా మారుతుంది. బ్లాక్‌ హెడ్స్, చర్మం రంగు మారడం, ఎండ వల్ల చర్మం కందిపోవడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఉన్నవారు ముల్తానీ మట్టిని ఉపయోగించాలి. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి ముల్తానీ మట్టితో ఆయా సమస్యల నుంచి ఎలా బయట పడాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. […]

 Authored By maheshb | The Telugu News | Updated on :9 March 2021,8:00 am

Multani Mitti : ముఖాన్ని కాంతివంతంగా మార్చడంతోపాటు పలు చర్మ సమస్యలను తగ్గించడంలో ముల్తానీ మట్టి అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల చర్మం మృదువుగా కూడా మారుతుంది. బ్లాక్‌ హెడ్స్, చర్మం రంగు మారడం, ఎండ వల్ల చర్మం కందిపోవడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఉన్నవారు ముల్తానీ మట్టిని ఉపయోగించాలి. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి ముల్తానీ మట్టితో ఆయా సమస్యల నుంచి ఎలా బయట పడాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

this is how multani mitti helps to get rid of face skin problems

this is how multani mitti helps to get rid of face skin problems

1. ఒక గిన్నెలో రెండు మూడు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టి తీసుకుని అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ చొప్పున పెరుగు, కీరదోస గుజ్జు, రెండు టీ స్పూన్ల శనగపిండిలను వేసి బాగా కలపాలి. తరువాత పాలు పోస్తూ మెత్తని మిశ్రమంగా చేయాలి. దాన్ని ముఖం, మెడకు రాయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. ప్రకాశిస్తుంది.

2. రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టి, ఒక టేబుల్‌ స్పూన్‌ పెరుగు, ఒకటిన్నర టీస్పూన్ల నిమ్మరసం, చిటికెడు పసుపులను తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాల్లో మాస్క్‌లా రాయాలి. తరువాత బాగా ఆరిపోయాక తడి చేత్తో రుద్దుతూ మొత్తం కడిగేయాలి. దీంతో బ్లాక్‌ హెడ్స్‌ సమస్య తగ్గుతుంది.

3. రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీమట్టిలో అంతే మోతాదులో బంగాళాదుంపల గుజ్జును కలిపి ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. బాగా ఆరాక కడిగేయాలి. దీంతో ఎండ వల్ల రంగు మారిన చర్మం తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటుంది.

4. రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టిలో ఒకటిన్నర టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నీళ్లు, పావు టేబుల్‌ స్పూన్‌ చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో ఎండ వల్ల కందిన చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది.

5. ఒక గుడ్డు తెల్లసొనలో రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టి, కొద్దిగా నీళ్లు కలిపి మెత్తని పేస్టులా తయారు చేయాలి. దాన్ని ముఖానికి రాయాలి. అనంతరం 20 నిమిషాలు ఆగాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. దీంతో చర్మం దృఢంగా ఉంటుంది. సాగిపోయినట్లు కనిపించదు.

6. చర్మం పొడిబారిపోయే సమస్య ఉన్నవారు రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీమట్టిలో ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం, ఒక టీస్పూన్‌ రోజ్‌ వాటర్‌ కలిపి ఆ మిశ్రమాన్ని మాస్క్‌లా వేయాలి. 30 నిమిషాల నుంచి 60 నిమిషాల పాటు ఆగాక కడిగేయాలి. దీంతో చర్మం తేమగా మారుతుంది. మృదుత్వం వస్తుంది.

maheshb

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది