Multivitamin Tablets : మల్టీ విటమిన్ టాబ్లెట్స్ అతిగా తీసుకుంటున్నారా… మరణం ఖాయం…!
Multivitamin Tablets : ప్రస్తుత కాలంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవటం వలన టాబ్లెట్లు కూడా ఎక్కువగా వాడుతూ ఉన్నాము. అయితే మల్టీ విటమిన్ టాబ్లెట్స్ లను ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఈ మల్టీ విటమిన్ లు మానవులు పాలిట మరణ మృదంగాన్ని మోగిస్తున్నాయి అని అంటున్నారు నిపునులు. తాజాగా నిర్వహించినటువంటి సర్వేలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. వీటిని తీసుకోవటం వలన ప్రాణాలు నిలిచే అవకాశం కంటే తొందరగా మరణించే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి అని వైద్య నిపుణులు చెప్పారు. తరచుగా విటమిన్ల పేరుతో టాబ్లెట్లు తీసుకున్నట్లయితే మరణాల శాతం కూడా సాధారణ కంటే నాలుగు శాతం పెరిగింది అని నేషనల్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు నిర్వహించిన సర్వేలో తేలింది. వీటిపై సరైన ఆధారాలు లభ్యం కానప్పటికీ కూడా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవారు. ఈ సబ్సిట్యూట్స్ తీసుకోవటం వలన ఎన్నో సమస్యలకు గురవుతున్నారు అని తెలిపారు…
60 సంవత్సరాలు వయసు పైబడిన సుమారు 3 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా, అనారోగ్య సమస్యల భారీగా పడినప్పుడు మాత్రమే ఎక్కువగా ఈ మల్టీ విటమిన్ టాబ్లెట్లను వాడుతున్నట్లుగా తేరింది. దీనిలో విటమిన్ సి వలన ఎక్కువ ప్రయోజనం పొందినట్లుగా తెలుపుతున్నారు. దీన్ని బట్టి అర్థమయింది ఏమిటి అంటే. జీవితంలో పోషకాహారానికి మించింది మరి ఏదీ లేదని మరొకసారి రుజువు అయింది. అయితే వాటికి బదులుగా ఇలాంటి మల్టీ విటమిన్ సబ్సిట్యూట్స్ పై ఆధారపడితే కొత్త వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
మనం తరచూ తీసుకునే ఆహారంలో మంచి ఫ్యాట్, విటమిన్లు, పోషకాలు, లవణాలు అనేవి ఎంతో పుష్టిగా ఉండేలా చూసుకోవాలి అని వైద్యులు తెలిపారు. దీనివలన ఎలాంటి వ్యాధినైనా ఇట్టే తగ్గించే ఉన్నతక శక్తి శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతుంది అని తెలుపుతున్నారు. ఏదైనా ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఎక్కువ పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి అని సూచిస్తున్నారు. దీని వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంటుంది అని వైద్యులు తెలిపారు…