Watermelon : వేసవి కాలంలో ఏది తిన్న ఏది తాగిన చల్ల చల్లగా తినాలనిపిస్తూ.. తాగాలనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా మన శరీరం చల్లగా ఉండే వాటినీ కోరుకుంటూ ఉంటుంది. అయితే ఈ వేసవిలో ఎక్కువగా పుచ్చకాయలను తింటూ ఉంటాం.. పుచ్చకాయ శరీరాన్ని చల్లబరచడానికి చాలా బాగా సహాయపడుతుంది. పుచ్చకాయలు లైకోపిన్ యాంటీ ఆక్సిడెంట్, ఎలిమెంట్స్ విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అయితే బరువు తగ్గాలని ప్రయత్నించేవారు ఈ పుచ్చకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కావున ఈ పండు తీసుకోవడం వల్ల మన పొట్ట ఎక్కువ సమయం నిండుగా అనిపిస్తుంది. ఈ పండు వేసవిలో ఎండ వేడి నుంచి మన శరీరాన్ని చల్లగా ఉంటుంది.
దీనిలో 92 శాతం నీరే ఉంటుంది కావున.. మన శరీరానికి ఎక్కువ వాటర్ కంటెంట్ ఇస్తుంది. తాజా పుచ్చకాయలు సిట్రోలైన్ అనే ముఖ్యమైన ఆమైనో ఆమ్లం ఉంటుంది. ఈ సిట్రులైన నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేస్తుంది. దాని ఫలితంగా రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. పుచ్చకాయల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా పుచ్చకాయ శరీరంలో చక్కెర పరిమాణాన్ని కంట్రోల్ చేస్తుంది. డైట్ చేసే వారికి కూడా పుచ్చకాయ చాలా బాగా మేలు చేస్తుంది. అయితే కొందరు పుచ్చకాయను ఫ్రిజ్లో ఉంచి తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పోషక విలువలు తగ్గుతాయని చాలామందికి తెలియదు…సహజంగా చాలామంది మార్కెట్ నుంచి పండ్లను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చిన తర్వాత వాటిని ఫ్రిజ్లో పెడుతూ ఉంటారు.
అయితే పండ్లను కోసి ఫ్రిజ్లో ఉంటే మాత్రం వెంటనే దాన్ని పడేయండి. ప్రధానంగా పుచ్చకాయని ఫ్రిజ్లో పొరపాటున కూడా పెట్టవద్దు. పుచ్చకాయను ఫ్రిజ్లో ఉంచడం కంటే గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎంత ఎండలోనైనా పుచ్చకాయ చాలా చల్లగా ఉంటుంది. తినడానికి రుచికరమైనది కానీ కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో ఉంచితే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సహజంగా కోసిన పుచ్చకాయపై బ్యాక్టీరియా పెరగడం మొదలవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కాబట్టి ఫ్రిజ్లో ఉంచడం కంటే నీటిలో వేసి కొద్దిసేపు ఉంచి ఆ పుచ్చకాయని కట్ చేసుకుని తినడం చాలా మంచిది. కట్ చేసిన పుచ్చకాయని అసలు స్టాక్ ఉంచొద్దు.. అలాగే ఫ్రిజ్లో పెట్టవద్దు..
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.